BSNL Prepaid Plans | బీఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త రీచార్జ్ ప్లాన్స్.. హైస్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్‌తో
BSNL Prepaid Plans | ఈ ప్లాన్స్‌లో హైస్పీడ్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఉచిత ఎస్ఎంఎస్లు లభించనున్నాయి. రూ.184, రూ.185, రూ.186 ప్లాన్స్‌కు వాలిడిటీ 28 రోజులు ఉండగా
BSNL Prepaid Plans | బీఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి వచ్చాయి. రూ.184, రూ.185, రూ.186, రూ.347 ప్లాన్లు కొత్తగా వచ్చాయి. ఈ ప్లాన్స్‌లో హైస్పీడ్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఉచిత ఎస్ఎంఎస్లు లభించనున్నాయి. రూ.184, రూ.185, రూ.186 ప్లాన్స్‌కు వాలిడిటీ 28 రోజులు ఉండగా.. రూ.347 ప్లాన్‌కు 56 రోజుల వాలిడిటీ లభించనుంది.

ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ స్పెషల్ టారిఫ్ వోచర్స్‌గా లభిస్తాయి. 184 ప్లాన్‌లో భాగంగా అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజూ 1 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది.
185 ప్లాన్‌లో భాగంగా అన్లిమిటెడ్ లోకల్ కాల్స్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజూ ఒక జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. 184 ప్లాన్‌తో పోల్చితే 185 ప్లాన్‌లో పీఆర్బీటీ ఉచిత యాక్సెస్, అరెనా మొబైల్ గేమింగ్ సర్వీస్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
186 ప్లాన్‌లో భాగంగా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 1 జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల పాటు రోజూ 100 ఎస్ఎంఎస్లు, 28 రోజులకు పీఆర్బీటీ ఉచిత యాక్సెస్, హార్డీ గేమ్స్ సర్వీస్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
347 ప్రీపెయిడ్ ప్లాన్‌లో భాగంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్, 2 జీబీ హైస్పీడ్ డేటా యాక్సెస్ 56 రోజుల పాటు వాలిడిటీ లభిస్తుంది. హైస్పీడ్ డేటా లిమిట్ ఒకసారి పూర్తయితే స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఢిల్లీ, ముంబైలో కూడా కొత్త ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

