Xiaomi | హాట్ ఫీచర్లతో రానున్న షియామి 12ఎస్, షియామి 12ఎస్ ప్రొ
షియామి 12ఎస్, షియామి 12ఎస్ ప్రొ స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో లీకయ్యాయి. కంపెనీ ఇప్పటికే షియామి 12, షియామి 12 ప్రొ, షియామి 12ఎక్స్ స్మార్ట్ఫోన్లను పలు మార్కెట్లలో లాంఛ్ చేయగా షియామి 12 అల్ట్రా లాంఛ్ ఈవెంట్ జులైలో జరగనుంది.
న్యూఢిల్లీ : షియామి 12ఎస్, షియామి 12ఎస్ ప్రొ స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో లీకయ్యాయి. కంపెనీ ఇప్పటికే షియామి 12, షియామి 12 ప్రొ, షియామి 12ఎక్స్ స్మార్ట్ఫోన్లను పలు మార్కెట్లలో లాంఛ్ చేయగా షియామి 12 అల్ట్రా లాంఛ్ ఈవెంట్ జులైలో జరగనుంది. ఇక ఎంపిక చేసిన మార్కెట్లలో షియామి 12ఎస్, షియామి 12ఎస్ ప్రొ ఈ ఏడాది చివరిలో లాంఛ్ కానున్నాయి.
అధికారిక లాంఛ్‌కు ముందే ఈ రెండు ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్ల కీలక స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ రెండు ఫోన్ల ప్రాసెసర్, ర్యాం, స్టోరేజ్ వివరాలను టిప్‌స్టార్ ముకుల్ శర్మ వెల్లడించారు. షియామి 12ఎస్ స్నాప్‌డ్రాగన్ 8+ జనరేషన్ 1 ఎస్ఓసీ చిప్సెట్తో 8జీబీ ర్యాం, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లతో రానున్నాయి.
120డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో కస్టమర్ల ముందుకు రానున్నాయి. మరో వేరియంట్‌ను మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ఎస్ఓసీ చిప్సెట్తో లాంఛ్ చేయనున్నారు. ఈ వేరియంట్ కూడా రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌తో రానుంది. ఇక లీకా-ట్యూన్డ్ స్మార్ట్‌ఫోన్ కెమెరాలతో షియామి 12ఎస్ సిరీస్‌ను లాంఛ్ చేయవచ్చని భావిస్తున్నారు. లీకా-ట్యూన్డ్ కెమెరాలను కలిగిఉన్న కంపెనీ తొలి స్మార్ట్‌ఫోన్ షియామి 12 అల్ట్రా కావడం గమనార్హం.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

