Battlegrounds Mobile India : బ్యాటిల్‌గ్రౌండ్స్ యాప్ షాకింగ్ నిర్ణయం.. ఆ ప్లేయర్లు బ్యాన్
పబ్జీ గేమ్ గురించి తెలిసిన వాళ్లకు బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పబ్జీ బ్యాన్ తర్వాత దేశీయ యాప్ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియాను ఇటీవలే విడుదల చేశారు. ఈ యాప్ అచ్చుగుద్దినట్లు పబ్జీ లాగానే ఉంటుంది. పబ్జీ గేమ్ విడుదలైనప్పుడు యూత్ అంతా ఆ గేమ్‌కు ఎలా అడిక్ట్ అయ్యారో అందరికీ తెలుసు. పబ్జీ బ్యాన్‌తో చాలామంది నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత రీసెంట్గా బ్యాటిల్‌గ్రౌండ్స్ యాప్‌ను రిలీజ్ చేయడంతో.. కోట్ల మంది ప్లేయర్లు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు.

5 కోట్ల డౌన్‌లోడ్స్‌కు చేరువలో ఉంది ఈ యాప్. ఇప్పటికే 48 మిలియన్ల డౌన్లోడ్స్ అయ్యాయి. 50 మిలియన్ డౌన్లోడ్స్ అవ్వగానే.. ప్లేయర్లకు స్పెషల్ రివార్డ్స్‌ను అందిస్తామని కంపెనీ క్రాఫ్టన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మరోవైపు యాప్‌లో నిషేధిత ప్రోగ్రామ్‌లను ఉపయోగించి.. చీట్ చేస్తూ గేమ్‌లో అడ్వాంటేజ్ పొందేందుకు కొందరు ప్లేయర్లు ప్రయత్నించినట్టు కంపెనీ గుర్తించింది. దీంతో.. అలా గేమ్‌లో చీట్ చేసిన 3,36,736 మంది ప్లేయర్లను క్రాఫ్టన్ కంపెనీ బ్యాన్ చేసింది. ఆ యూజర్లు గేమ్‌ను మళ్లీ డౌన్లోడ్ చేసుకోకుండా.. ఇన్స్టాల్ చేసుకోకుండా శాశ్వతంగా బ్యాన్ చేసినట్టు ప్రకటించింది. జులై 30 నుంచి ఆగస్టు 5 వ తారీఖు మధ్య ప్లేయర్ల మీద నిఘా పెట్టిన కంపెనీ.. సదరు యూజర్లు చీట్ చేస్తున్నట్టు గుర్తించింది. దీంతో ఆయా యూజర్లను వెంటనే బ్లాక్ చేసేసింది.
ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ యాప్ అందుబాటులో ఉంది. త్వరలోనే ఐవోఎస్ యూజర్లకు కూడా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు క్రాఫ్టన్ ప్రకటించినప్పటికీ.. విడుదల తేదీని మాత్రం ఇంకా కన్ఫమ్ చేయలేదు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

