Apple on I-Pod | ఐప్యాడ్‌పై ఆపిల్ బిగ్ అప్డేట్.. లాప్టాప్.. లేదా ఐఫోన్లా వాడొచ్చు?!
Apple on I-Pod | త్వరలో ఆపిల్ బిగ్ అప్డేట్ ఇవ్వనుంది. లాప్టాప్/ ఐ-ఫోన్‌గా వాడుకునేలా ఐప్యాడ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసిందని సమాచారం.
Apple on I-Pod | ఇది ఆవిష్కరణల యుగం.. టెక్నాలజీతో ఏదైనా సాధించొచ్చు అన్న నానుడి స్థిరమవుతున్నది. ఇది టెక్ జెయింట్ ఆపిల్ విషయంలో మరోమారు రుజువైంది. రకరకాల సాఫ్ట్వేర్ల రాకతో మ్యూజిక్ ప్రియుల కోసం తెచ్చిన ఇటీవల ఐ-ప్యాడ్స్ తయారీ నిలిపేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది ఆపిల్.. ఇదే ఐ-ప్యాడ్ల విషయమై నెటిజన్లకు, టెక్కీలకు బిగ్ అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. సోమవారం (జూన్ 6) నుంచి జరిగే ఆపిల్.. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్-2022లో ఈ సంగతి వెల్లడించడానికి రంగం సిద్ధమైంది.
ఐ-ప్యాడ్ సాఫ్ట్‌వేర్‌ను ల్యాప్‌టాప్‌గా గానీ, స్మార్ట్‌ఫోన్‌గా గానీ వాడుకునేలా దాని సాఫ్ట్‌వేర్‌లో గణనీయ మార్పులు తేవడానికి ఆపిల్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. త్వరలో వచ్చే ఐపాడ్ఓఎస్16లోనే ఈ మార్పు చోటు చేసుకుంటుందని భావిస్తున్నారు. ఒక లాప్టాప్గా లేదా ఒక డెస్క్‌టాప్‌గా మల్టీ టాస్కింగ్ సామర్థ్యం గల డివైజ్‌గా ఐపాడ్ రూపుదిద్దుకోనున్నది.
న్యూ సాఫ్ట్వేర్ ఏయే యాప్స్‌లో ఓపెన్ అవుతుందని మున్ముందు తేలనున్నది. యాప్ బయటకు వచ్చాక దాన్ని మల్టీపుల్‌గా వాడేందుకు రీసైజ్ యాప్ విండోస్‌ను విభిన్న మార్గాల్లో వాడేందుకు ఇది అనుమతిస్తుందని భావిస్తున్నారు. ఐ-ప్యాడ్ యూజర్లు ఫుల్ స్క్రీన్‌తో ఐఫోన్లా కానీ, సైడ్ బై సైడ్ రెండు యాప్‌లు ఒకేసారి వాడుకునేలా ఉంటుందని చెబుతున్నారు. ఇంకా ఐఫోన్, మాక్, ఆపిల్ వాచ్, ఆపిల్ టీవీల్లో సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్‌పై ఆపిల్ యాజమాన్యం డబ్ల్యూడబ్ల్యూడీసీలో ప్రకటన చేయొచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

