న్యూయార్క్ : ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌గా యాపిల్ అరుదైన ఘనత సాధించింది. యాపిల్ వాచ్ గడిచిన క్వార్టర్లో 36.1 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. శాంసంగ్ మార్కెట్ వాటా 10.1 శాతం కంటే మూడు రెట్లు అధికంగా యాపిల్ వాచ్ మార్కెట్ వాటా ఉండటం గమనార్హం.
యాపిల్ మార్కెట్ వాటా వార్షిక వృద్ధి 14 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే స్మార్ట్‌వాచ్ మార్కెట్ షిప్‌మెంట్స్ ఈ ఏడాది తొలి క్వార్టర్లో 13 శాతం వృద్ధి చెందాయి. నెక్ట్స్ యాపిల్ వాచ్ మోడల్ వచ్చే నాటికి సంవత్సరాంతంలో యాపిల్ మార్కెట్ వాటా మరింత పెరగవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆర్ధిక మందగమనం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి సమస్యలు ఉన్నా ఈ ఏడాది స్మార్ట్‌వాచ్‌ల విక్రయాలు ముమ్మరంగా సాగాయి. బ్రాండ్ వ్యాల్యూ ఆధారంగా యాపిల్ వాచ్ గత క్వార్టర్లో బంపర్ సేల్స్ జరిగాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చి అసోసియేట్ డైరెక్టర్ సుజోంగ్ లిమ్ పేర్కొన్నారు. ఇక స్మార్ట్‌వాచ్ విక్రయాల్లో హువేయి, షియామి రెండు, మూడు స్ధానాల్లో ఉన్నాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చి వెల్లడించింది.