Generative AI roles | జనరేటివ్ ఏఐలో పలు ఉద్యోగాలకు యాపిల్ రిక్రూట్మెంట్
లేటెస్ట్ టెక్నాలజీ జనరేటివ్ ఏఐని (Generative AI roles) తమ ప్రోడక్ట్స్‌లో పెద్దఎత్తున ఉపయోగించేందుకు టెక్ దిగ్గజం యాపిల్ సన్నాహాలు చేపట్టింది. ఏఐకి సంబంధించి పలు జాబ్ లిస్టింగ్స్‌ను యాపిల్ పోస్ట్ చేసింది.
న్యూయార్క్ : లేటెస్ట్ టెక్నాలజీ జనరేటివ్ ఏఐని (Generative AI roles) తమ ప్రోడక్ట్స్‌లో పెద్దఎత్తున ఉపయోగించేందుకు టెక్ దిగ్గజం యాపిల్ సన్నాహాలు చేపట్టింది. ఏఐకి సంబంధించి పలు జాబ్ లిస్టింగ్స్‌ను యాపిల్ పోస్ట్ చేసింది. తమ డివైజ్‌లు, సాఫ్ట్‌వేర్‌లో ఏఐ టెక్నాలజీని జోడించేందుకు యాపిల్ కసరత్తు సాగిస్తోందని, ఇందుకు పలు ఏఐ రోల్స్ కోసం హైరింగ్‌ను చేపడుతోందని సమాచారం. ట్రాన్స్ఫార్మర్ మోడల్‌గా పిలిచే టెక్నాలజీ ఆధారంగా ఐఓఎస్ 17కు యాపిల్ ఇటీవలే న్యూ ఆటోకరెక్ట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిందని టెక్ నిపుణులు గుర్తుచేస్తున్నారు.
యాపిల్ డివైజ్‌ల్లో ఆటోకరెక్ట్ కచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు ఈ టెక్నాలజీ ఏఐని వాడుకుంటుంది. తమ ఉత్పత్తుల మెరుగుదలకు యాపిల్ ఏఐపై పెద్దమొత్తంలో పెట్టుబడులు పెడుతుందనేందుకు ఇవి సంకేతాలని చెబుతున్నారు. జనరేటివ్ ఏఐకి సంబంధించి యాపిల్ పలు జాబ్ లిస్టింగ్స్‌ను యాపిల్ పోస్ట్ చేసింది. యాప్ డెవలపర్స్ మెరుగైన యాప్స్ తయారుచేసేలా జనరేటివ్ ఏఐ సిస్టమ్ వారికి సాయపడేలా యాపిల్ ఏఐ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనుంది.
వాయిస్, చాట్ వాడుతూ కస్టమర్స్‌తో మాట్లాడేలా సిస్టమ్‌ను నిర్మించే వ్యక్తుల కోసం కూడా యాపిల్ అన్వేషిస్తోంది. సుదీర్ఘ టెక్ట్స్ రాయడం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటి పనుల కోసం టెక్ట్స్ టెక్నాలజీపైనా యాపిల్ కసరత్తు సాగిస్తోంది. ఇక జనరేటివ్ ఏఐ ఉత్పత్తులు, ఫీచర్ల అభివృద్ధి కోసం యాపిల్ ఏటా రూ. 8000 కోట్లు పైగా వెచ్చించేందుకు యాపిల్ సంసిద్ధమైంది.
Read More :
Jio Prepaid | యూజర్ల కోసం జియో వార్షిక సబ్ స్క్రిప్షన్లు ప్లాన్లు.. ఇవీ డిటైల్స్.. !
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

