Apple | ఏఐ స్టార్టప్ డార్విన్ఏఐని కొనుగోలు చేసిన యాపిల్
Apple : ఓపెన్ఏఐ ఇంటరాక్టివ్ జనరేటివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీని లాంఛ్ చేసిన అనంతరం పలు టెక్ కంపెనీలు తమ సొంత చాట్‌బాట్స్‌ను క్రియేట్ చేశాయి.
Apple : ఓపెన్ఏఐ ఇంటరాక్టివ్ జనరేటివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీని లాంఛ్ చేసిన అనంతరం పలు టెక్ కంపెనీలు తమ సొంత చాట్‌బాట్స్‌ను క్రియేట్ చేశాయి. దిగ్గజ టెక్ సంస్ధలు ఏఐలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ భవిష్యత్ టెక్నాలజీకి సన్నద్ధమవుతున్నారు. ఇక లేటెస్ట్గా మరో టెక్ దిగ్గజం యాపిల్ కూడా ఏఐ రేస్‌లో ముందుకొచ్చింది. ఏఐ టెక్నాలజీపై భారీ ప్రణాళికలు రూపొందిస్తున్న యాపిల్ ఇటీవల ఏఐ స్టార్టప్ డార్విన్ఏఐని కొనుగోలు చేసింది.
ఏఐ వ్యవస్ధలను వేగవంతంగా మలిచేందుకు ఇది యాపిల్‌కు సహకరిస్తుందని చెబుతున్నారు. డార్విన్ఏఐని కొనుగోలు చేసిన యాపిల్ ఆ ఉద్యోగులను తన సొంత ఏఐ విభాగంలోకి తీసుకుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ తెలిపింది. కెనడియన్ కంపెనీ డార్విన్ఏఐ కొనుగోలు ప్రక్రియను యాపిల్ ఈ ఏడాది ఆరంభంలో పూర్తి చేసింది. ఇక డార్విన్ఏఐ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించిన ఏఐ రీసెర్చర్ అలెగ్జాండర్ వాంగ్ యాపిల్ ఏఐ గ్రూప్‌లో డైరెక్టర్‌గా చేరారు.
డార్విన్ఏఐ ఉద్యోగులు పలువురు ఇప్పుడు యాపిల్ ఏఐ విభాగంలో చేరిపోయారు. ఇక ఏఐ ప్రణాళికలపై కసరత్తు సాగుతున్నదని, దీనిపై త్వరలో వివరాలు వెల్లడిస్తామని యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇటీవల వెల్లడించారు. ఏఐకి మ్యాక్ కంటే మెరుగైన కంప్యూటర్ ఏదీ మార్కెట్లో లేదని కుక్ వ్యాఖ్యానించారు.
Read More :
Bramayugam Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘భ్రమయుగం’.. ఎక్కడ చూడొచ్చంటే.?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- AI Startup
- Apple
- DarwinAI
- purchased
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

