ఆఫీస్‌కు రావాలని ఉద్యోగులకు యాపిల్ పిలుపు : కంపెనీని వీడేందుకు సిద్ధమైన టెకీలు
కరోనా మహమ్మారితో రెండేండ్ల పాటు ఇంటి నుంచే పనిచేసిన టెకీలు క్రమంగా కార్యాలయాల బాట పడుతున్నారు. పలు సంస్ధలు ఇప్పటికే ఉద్యోగులను ఆఫీసులకు పిలిపించగా తాజాగా టెక్ దిగ్గజం యాపిల్ మే 23 నుంచి కార్యాలయాలకు రావాలని వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని ఉద్యోగులను కోరింది.
న్యూయార్క్ : కరోనా మహమ్మారితో రెండేండ్ల పాటు ఇంటి నుంచే పనిచేసిన టెకీలు క్రమంగా కార్యాలయాల బాట పడుతున్నారు. పలు సంస్ధలు ఇప్పటికే ఉద్యోగులను ఆఫీసులకు పిలిపించగా తాజాగా టెక్ దిగ్గజం యాపిల్ మే 23 నుంచి కార్యాలయాలకు రావాలని వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని ఉద్యోగులను కోరింది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఉద్యోగులను కోరుతూ రిటన్ టూ ఆఫీస్ పాలసీని వెల్లడించారు. కంపెనీ విధానాన్ని 76 శాతం మంది యాపిల్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.
యాపిల్ పాలసీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, కంపెనీని వీడి పనిలో మరింత వెసులుబాటు కల్పించే మరో టెక్ కంపెనీలో చేరాలని వారు యోచిస్తున్నారని సోషల్ నెట్వర్క్ యాప్ బ్లైండ్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 19 మధ్య 652 మంది యాపిల్ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించామని బ్లైండ్ పేర్కొంది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి వీరంతా ఇంటి నుంచి పనిచేస్తున్నారని తెలిపింది.
ఆఫీసు నుంచి పనిచేయాల్సి వస్తే తమకు రవాణా పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. కొందరు ఉద్యోగులు యాపిల్‌ను వీడి మరింత వెసులుబాటు కల్పించే ఇతర టెక్ కంపెనీల్లో కొలువులు చూసుకుంటామని చెప్పారని బ్లైండ్ వెల్లడించింది. మరోవైపు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సైతం ఉద్యోగులను ఆఫీసుల బాట పట్టించేందుకు సన్నద్ధమైంది. ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉద్యోగులకు ఇస్తూ వారిని ఆఫీసులకు రప్పించేందుకు కసరత్తు సాగిస్తోంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

