Joker Malware : హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పిన జోకర్ ఎంత ప్రమాదకరం.. అది ఏం చేస్తుంది
Joker Malware | ఆండ్రాయిడ్ యూజర్లు జాగ్రత్త !! గతంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లను బెంబేలెత్తించిన మాల్వేర్ జోకర్ మళ్లీ వచ్చేసింది. మనకు తెలియకుండానే
Joker Malware | ఆండ్రాయిడ్ యూజర్లు జాగ్రత్త !! గతంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లను బెంబేలెత్తించిన మాల్వేర్ జోకర్ మళ్లీ వచ్చేసింది. యాప్‌ల ద్వారా చాపకింద నీరుల మొబైల్‌లోకి చొరబడి మనకు తెలియకుండానే అకౌంట్లను ఖాళీ చేసి అప్పట్లో భయపెట్టించిన ఈ మాల్వేర్ ఇప్పుడు మళ్లీ ఆండ్రాయిడ్ యూజర్లను ముప్పుతెప్పలు పెట్టిస్తోంది. ముంబైలో గత మూడు నెలలుగా ఈ మాల్వేర్తో మోసాలకు పాల్పడ్డ ఈ నేరగాళ్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైనా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఏకంగా హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఈ మాల్వేర్ గురించి హెచ్చరించారు.

ఈ జోకర్ మాల్వేర్ను ఇప్పటికే గూగుల్ బ్లాక్ చేసిందని.. ప్లే స్టోర్ నుంచి తొలగించిందని.. అయినప్పటికీ వివిధ పేర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. మరి అంతలా భయపడుతున్న ఈ జోకర్ మాల్వేర్ ఎంత ప్రమాదం? ఒక్కసారి ఇది మొబైల్లో చొరబడితే ఏమవుతుంది? జోకర్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

2017లో తొలిసారిగా జోకర్ ఎటాక్
జోకర్ మాల్వేర్ 2017లో మొదటిసారి గూగుల్‌లో కనిపించింది. లక్షలాది మంది ఈ మాల్వేర్ బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నారు. దీంతో అప్రత్తమైన గూగుల్ సంస్థ.. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసింది. ఇది చాలా ప్రమాదకరమైన మాల్వేర్ అని.. దీన్ని అడ్డుకట్ట వేసుందుకు మూడేళ్ల పాటు శ్రమించామని గత ఏడాది గూగుల్ ప్రకటించుకుంది కూడా. కానీ అదే ఏడాది జూలైలో గూగుల్ ప్లే స్టోర్‌లో మళ్లీ జోకర్ కదలికలు కనిపించాయి. దీంతో ప్లే స్టోర్ నుంచి పలు అనుమానాస్పద యాప్‌లను గూగుల్ తొలగించింది. అయినప్పటికీ జోకర్ మళ్లీ తిరిగొచ్చాడు. ఇప్పుడు ఈ మాల్వేర్ గురించి ఫిర్యాదులు రావడంతో మహారాష్ట్ర పోలీసులు దేశవ్యాప్తంగా అలర్ట్ జారీ చేశారు. దీంతో తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తమై.. ఆండ్రాయిడ్ యూజర్లను హెచ్చరించారు. ఇప్పటికే 8 రకాల జోకర్ మాల్వేర్ ప్లే స్టోర్‌లోని యాప్‌లో గుర్తించినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్విక్హిల్ టెక్నాలజీస్ గురువారం ప్రకటించింది. ఈ మాల్వేర్ ఉన్న యాప్‌లకు ప్లేస్టోర్ నుంచి 50వేల డౌన్లోడ్లు అయినట్లు పేర్కొంది.
అసలు Joker ఏం చేస్తాడు

జోకర్ అనేది ఒక ప్రమాదకరమైన మాల్వేర్. వినియోగదారులకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు మాయం చేయగలదు. యాప్‌లను ఓపెన్ చేసినప్పుడు వచ్చే అడ్వర్టైస్మెంట్ల రూపంలో ఈ మాల్వేర్ మొబైల్‌లోకి ప్రవేశిస్తుంది. ఒక్కసారి ఈ మాల్వేర్ మన మొబైల్‌లోకి చేరగానే.. ఫొటోలు, బ్యాంకు ఖాతా వివరాలు సహా మొత్తం డేటాను సేకరిస్తుంది. ఆ తర్వాత యూజర్‌కు తెలియకుండానే యూజర్ అకౌంట్ల ద్వారా ప్రీమియం సబ్స్క్రిప్షన్లలోకి సైన్ ఇన్ అవుతూ డబ్బులు దోచేస్తోంది. ఆ సమయంలో బ్యాంక్ ట్రాన్సక్షన్లకు సంబంధించి వచ్చే మెసేజ్‌లు, ఓటీపీలను కూడా ఈ మాల్వేర్ నియంత్రిస్తుంది. దానివల్ల మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఖాళీ అయిన విషయం కూడా మనకు తెలియదు. బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ చెక్ చేసినప్పుడు మాత్రమే అసలు మోసం బయటపడుతుంది. కాబట్టి యాడ్లను క్లిక్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు అవసరం

- అనవసర, తెలియని యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవద్దు.
- ఒకవేళ ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాల్సి వస్తే రివ్యూలను చదివిన తర్వాతనే ఇన్స్టాల్ చేసుకోవాలి.
- ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన యాప్ అయినా సరే.. అనుమానంగా అనిపిస్తే అన్ఇన్స్టాల్ చేయాలి
- అవసరం లేని యాప్‌లకు ఎస్ఎంఎస్ యాక్సెస్ పర్మిషన్ను తీసేయాలి.
- అవసరం లేని సర్వీసులు, సబ్స్క్రిప్షన్లను రిమూవ్ చేసుకోవాలి
- బ్యాంకింగ్ వివరాలు, ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను మొబైల్లో సేవ్ చేసుకోకపోవడం మంచిది.
- యాంటీ వైరస్‌ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Fake Facebook Account : మీ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా ఉందా? ఇలా డిలీట్ చేయండి
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
ఐఫోన్ పాస్‌కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

