Amazon | భారత్‌లో అమెజాన్ ఇంటర్నెట్ సేవలు..! అనుమతి కోసం రెగ్యులేటరీకి దరఖాస్తు..!
Amazon | ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ త్వరలోనే భారత్‌లో ఇంటర్నెట్ సేవలు అందించబోతున్నది. ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాంట్ ఇంటర్నెట్ సేవలైన ప్రాజెక్ట్ కైపర్‌ను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్న కంపెనీ.. ఇందుకోసం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తున్నది.
Amazon | ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ త్వరలోనే భారత్‌లో ఇంటర్నెట్ సేవలు అందించబోతున్నది. ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాంట్ ఇంటర్నెట్ సేవలైన ప్రాజెక్ట్ కైపర్‌ను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్న కంపెనీ.. ఇందుకోసం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తున్నది. వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో 3,236 ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నది. ప్రాజెక్టులో భాగంగా 2026నాటికి సగానికిపైగా ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకున్నది.
అమెజాన్ ఈ-కామర్స్‌తో పాటు ప్రైమ్ వీడియో సేవలను విస్తరించేందుకు దోహదపడనున్నది. ఈ క్రమంలో భారత్‌లోనూ శాటిలైట్ సేవలను ప్రారంభించేందుకు రెగ్యులేటరీ ఆమోదం పొందేందుకు అమెజాన్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce)కి దరఖాస్తు చేసిందని జాతీయ మీడియా పేర్కొంది. ప్రాజెక్ట్ కైపర్‌కు భారత్‌లో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుంచి శాటిలైట్ సర్వీసెస్ (GMPCS) అనుమతి కూడా కావాల్సి ఉంటుంది.
శాటిలైట్ ద్వారా తక్కువ ధరకే వన్ జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందించే అవకాశాలున్నాయి. భారత్‌లోని గ్రామీణ, మారమూల ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా తక్కువ ధరలకే బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుతాయని పేర్కొన్నాయి. భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుండడంతో కంపెనీ విస్తరణకు తోడ్పాటునందించే అవకాశం ఉంది. అమెజాన్ ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ సేవల విస్తరణకు సైతం దోహదపడనున్నది. ఇంతకు ముందు వన్‌వెబ్, జియో శాలిలైట్లకు ప్రభుత్వం జీఎంపీసీఎస్ లైన్స్‌లు మంజూరు చేసింది.
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ సైతం దరఖాస్తు చేసుకోగా.. ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం స్టార్‌లింక్ ఐదువేలకుపైగా ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టింది. ఇదిలా ఉండగా.. అమెజాన్ ప్రాజెక్ట్ కైపర్ ఇంటర్నెట్ సేవల కోసం భారత్‌లో ఎంత వసూలు చేయనుందనే వివరాలు తెలియరాలేదు. 2024 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తేవాలని అమెజాన్ భావిస్తున్నది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

