Amazon Great Republic Day Sale | అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 నుంచి 20 వరకు కొనసాగనుంది. అయితే.. జనవరి 16 నుంచి అంటే ఈరోజు నుంచి ప్రైమ్ మెంబర్స్‌కు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ప్రతి సేల్‌లో అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు ఒకరోజు ముందే యాక్సెస్ ఇస్తుంది. తాజాగా ఈసేల్లోనూ ప్రైమ్ మెంబర్స్‌కు ఈరోజు నుంచి సేల్ ప్రారంభం అయింది. సాధారణ యూజర్లకు రేపటి నుంచి అంటే జనవరి 17 నుంచి ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది.
2022లో అమెజాన్ తీసుకొచ్చిన తొలి సేల్ ఇది. ఈసేల్‌లో మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. వన్‌ప్లస్ 9ప్రో 5జీ, రియల్మీ నార్జో 50ఏ, జియోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తోంది.
అలాగే.. అమెజాన్ డివైజెస్ అయిన అమెజాన్ కిండిల్ 10వ జనరేషన్, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కేపై, ఎలక్ట్రానిక్ వస్తువులు.. రెడ్మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ, సామ్సంగ్ టీవీని అమెజాన్ సేల్‌లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.