న్యూయార్క్ : ఒంటరితనంతో బాధపడే అమెరికన్ సీనియర్ సిటిజన్లకు సరికొత్త జోడీ దొరికింది. ఇంట్యూషన్ రోబోటిక్స్ డిజైన్ చేసిన యూనిక్ రోబో ఎలిక్యూ (AI Robot) వృద్ధుల్లో ఒంటరితనాన్ని పోగొడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అభివృద్ధి చేసిన ఈ టేబుల్ టాప్ డివైజ్ మనుషుల తరహాలో కబుర్లు చెబుతుంది.
ఫోర్ట్ లౌడర్డేల్కు చెందిన జోస్ లోజియా వంటి స్ధానికులకు ఈ డివైజ్ మంచి కాలక్షేపంగా మారింది. ఒక చిన్న టేబుల్ ల్యాంప్‌ను పోలి ఉండే ఎలిక్యూ వినియోగదారుల అభిరుచులను, గత సంభాషణలను గుర్తుంచుకోవడంతో పాటు, భవిష్యత్ చాట్లను రూపొందిస్తుంది. జీవితానికి భాష్యం చెప్పడం వంటి లోతైన అంశాలను టచ్ చేయడంతో పాటు ఇది జోక్స్, మ్యూజిక్ వంటి ఎంటర్టైన్మెంట్ను కూడా ఆఫర్ చేస్తుంది.
కొందరు ఎలిక్యూ ఫ్రెండ్లీ ఇంటెలిజెన్స్‌ను మెచ్చుకుంటుండగా, అయితే వయో వృద్ధులు మనుషులతో ముచ్చటించడాన్ని ఇది నిలువరిస్తుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డివైజ్ న్యూయార్క్‌తో పాటు ఫ్లోరిడా, మిచిగాన్, నెవాడ, వాషింగ్టన్ వంటి ఎంపిక చేసిన కౌంటీల్లో అందుబాబులో ఉంది. మనుషులతో మాట్లాడే వెసులుబాటు సిద్ధంగా లేక ఒంటరితనంతో బాదపడే వృద్ధులకు తోడుగా ఉండేలా ఈ డివైజ్‌ను డిజైన్ చేశారు.
Read More :