Aditya-L1 Mission | స్వదేశీ పరిజ్ఞానంతో.. ఆదిత్య ఎల్-1 మిషన్.. సెప్టెంబర్ 2న నింగిలోకి..!
Aditya-L1 Mission | చంద్రయాన్-3 ప్రయోగ విజయవంతమైన తర్వాత భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఉత్సాహంతో మరికొన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నది. సెప్టెంబర్ 2న ఈ ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది.
Aditya-L1 Mission | చంద్రయాన్-3 ప్రయోగ విజయవంతమైన తర్వాత భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఉత్సాహంతో మరికొన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నది. సెప్టెంబర్ 2న ఈ ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ మిషన్ ద్వారా సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరుపనున్నది. సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపడుతుండగా.. ఈ శాటిలైట్‌ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్-1 వద్ద కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది. ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టి.. సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయనున్నది.
ఇందు కోసం ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్లనున్నది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొర (కరోనా)పై అధ్యయనంలో చేయడంలో ఉపయోగపడనున్నాయి. ఆదిత్య ఎల్-1 పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో చేపడుతున్నది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ మిషన్ కోసం పేలోడ్స్‌ను అభివృద్ధి చేశాయి. ప్రయోగం కోసం రెండువారాల కిందటే పేలోడ్స్ ఏపీ శ్రీహరికోటలోని ఇస్రో స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. వచ్చే నెల 2న ప్రయోగం జరిగే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

