బీఆర్ఎస్ పార్టీకే చేవెళ్ల జై..
చేవెళ్ల.. ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో కంచుకోటగా ఉన్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ చేవెళ్ల ప్రజలు గులాబీ పార్టీకే జై కొట్టారు.
- చేవెళ్లలో హ్యాట్రిక్ విజయం బీఆర్ఎస్దేనంటున్న ఓటర్లు
- గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో విజయదుందుభి
- ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గులాబీకి అనుకూల పవనాలు
- కాంగ్రెస్, బీజేపీలకు ఓటమి తప్పదంటున్న ఓటర్లు
- చేవెళ్ల లోక్‌సభలో మొత్తం ఓట్లు 29,39,057
- 2019లో పోలైన 53.25 శాతం ఓట్లలో..40.62 శాతం ఓట్లతో బీఆర్ఎస్ గెలుపు
- 2014లో పోలైన 60.51 శాతం ఓట్లలో..
- 33.1శాతంతో గులాబీ రెపరెపలు
సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ ) : చేవెళ్ల.. ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో కంచుకోటగా ఉన్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ చేవెళ్ల ప్రజలు గులాబీ పార్టీకే జై కొట్టారు. అభ్యర్థులు ఎవరున్నా.. కేవలం బీఆర్ఎస్ పార్టీని చూసి జనం ఓట్లు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు మళ్లీ హ్యాట్రిక్ విజయం అందించి రికార్డు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నామంటూ చేవెళ్ల ప్రజ లు నినదిస్తున్నారు. 2014, 2019లో చేవెళ్ల లోక్‌సభ బరి లో కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించి గులాబీ జెండా రెపరెపలాడింది.
తొలుత 2014లో బీఆర్ఎస్ నుంచి కొం డా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. అతను పార్టీకి రాజీనామా చేసి మళ్లీ 2019లో కాంగ్రెస్ తరపున బరిలో దిగారు. ఆ సమయంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ప్రజలు జవా బు చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న రంజిత్ రెడ్డిని గెలిపించి గులాబీ పార్టీ దమ్ము చూపించారు. అప్పటి వరకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్‌ని చూసి మొదటిసారి గెలిచానని భ్రమలో ఉన్న అతడికి చేవెళ్ల ప్రజలు చురకలు పెట్టారు. ఇదే క్రమంలో ఇప్పుడు జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రంజిత్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు.
రంజిత్‌రెడ్డి కూడా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాదిరిగానే ఓటమి రుచి చూసేందుకు సిద్ధంగా ఉండాలని చేవెళ్ల ప్రజలు స్పష్టం చేస్తున్నారు. చేవెళ్ల నుంచి బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి అతడికి ఆదరణ లభించింది. చేవెళ్ల లోక్‌సభ విస్తరించి ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్‌లో గులాబీ గాలులు బలంగా వీస్తున్నాయి. దీనికి తోడు చేవెళ్ల లోక్‌సభ బీఆర్ఎస్ కంచుకోటగా ఉండటం.. రెండుసార్లు బీఆర్ఎస్ జెండా ఎగిరిన ప్రాంతం కావడంతో కాసాని గెలుపు ఖాయంగా కనిపిస్తున్నదని రాజకీయ నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు.


Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

