Vikarabad : ఎస్సై కొట్టాడని స్టేషన్ ఎదుట ఆందోళన

బొంరాస్ పేట : ఓ యువకుడిని ఎస్సై కొట్టాడని బాధితుని కుటుంబీకులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మండలంలోని నాందార్‌పూర్ గ్రామానికి చెందిన కోట్ల మల్లేశ్‌కు, రాఘవేందర్, అతని స్నేహితులకు మధ్య ఈ నెల 15వ తేదీ రాత్రి గొడవ జరిగింది. దీనిపై మల్లేశ్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాఘవేందర్ అతని స్నేహితులను విచారణ కోసం ఆదివారం ఎస్సై వెంకటనారాయణ పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. విచారణ క్రమంలో రాఘవేందర్‌ను ఎస్సై కొట్టడంతో సొమ్మసిల్లి కిందపడిపోయాడు. దీంతో వెంట వచ్చిన కుటుంబీకులు ఎస్సైకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు.
గంట వరకు ఆందోళన నిర్వహించగా పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ అప్పయ్య వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీలో చికిత్స పొందుతున్న రాఘవేందర్‌ను డీఎస్పీ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గొడవకు గల కారణాలను కొడంగల్ సీఐ అప్పయ్యతో కలిసి డీఎస్పీ నాందార్‌పూర్ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

