తిమ్మాపూర్ ఘటనలో మూడు మృతదేహాలు లభ్యం
తిమ్మాపూర్| జిల్లాలోని మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన పెళ్లిబృందం కారు లభించింది. అందులో మూడు మృతదేహాలు లభమయ్యాయి. కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా.. వరుడు నవాజ్ రెడ్డి, ఆయన అక్క శ్వేత మాత్రమే క్షేమంగా బయటపడ్డారు.

వికారాబాద్: జిల్లాలోని మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన పెళ్లిబృందం కారు లభించింది. అందులో మూడు మృతదేహాలు లభమయ్యాయి. కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా.. వరుడు నవాజ్ రెడ్డి, ఆయన అక్క శ్వేత మాత్రమే క్షేమంగా బయటపడ్డారు. వాగులో గల్లంతైనవారికోసం గాలిస్తుండగా వధువు ప్రవల్లిక, వరుడి అక్క రాధమ్మ, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి మృతదేహాలు లభించాయి. కాగా, కనిపించకుండా పోయిన ఇషాంత్ రెడ్డి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ నెల 26న రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డికి మోమిన్ పేటకు చెందిన ప్రవల్లికతో వివాహం జరిగింది. మోమిన్‌పేటకు వెళ్లి వస్తుండగా ఆదివారం రాత్రి తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయింది. రోడ్డుపై నీరు పారుతుండగా వద్దని వారించినా వినకుండా వాగుదాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

