సరదాలు వద్దు.. ఆరోగ్యమే ముద్దు..

- వైరస్ విజృంభణతో పార్టీలకు దూరంగా ఉంటున్న నగరవాసులు
- ఫ్యామిలీ టూర్లు, వీకెండ్ పార్టీలు రద్దు చేసుకుంటున్న యువత
హిమాయత్‌నగర్‌కు చెందిన ప్రతీక ఈ ఆదివారం ఫ్యామిలీతో అన్నవరం వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వాహనాన్ని మాట్లాడుకున్నారు. అక్కడ ఉండేందుకు గదులను కూడా బుక్ చేసుకున్నారు. కానీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించాక ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. వెళ్లే వీలున్నప్పటికీ కొవిడ్ పొంచి ఉండటంతో ధైర్యం చేయలేకపోయారు.
కీర్తి సాఫ్ట్వేర్ ఉద్యోగి. గోవాకు వెళ్లాలని స్నేహితులతో కలిసి ప్లాన్ చేసుకుంది. ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంది. అందుకోసం మినీ బస్సును మాట్లాడింది. కానీ కర్ఫ్యూ పరిస్థితులు వారిని పునరాలోచనలో పడేశాయి. వారి తల్లిదండ్రులు కూడా వద్దని వారించడంతో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.
కరోనా విజృంభణతో ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించడంతో బయటకు వెళ్లాలంటే నగరవాసులు సాహసించడం లేదు. మరీ ముఖ్యంగా వీకెండ్ సరదాలు, లాంగ్ టూర్లు, ఫ్యామిలీ ట్రిప్పులను రద్దు చేసుకుంటున్నారు. ప్రతీ వీకెండ్లో ఎంజాయ్ చేసే నగరవాసులు మరికొన్ని రోజులు పర్యాటక, ఫ్యామిలీ టూర్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు.
ఇంట్లోనే ఉందాం..
- రాత్రి కర్ఫ్యూ అమలులో ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
- ముఖ్యంగా చిన్నారులు మారాం చేస్తున్నారని కొందరు తల్లిదండ్రులు సరదాగా బయటకు తీసుకువెళ్తుంటారు.
- పబ్లిక్ పార్కులు, పర్యాటక ప్రాంతాల్లో తిరిగి వైరస్‌ను అంటించుకొని ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
- రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ఇంట్లోనే ఉండటం ఉత్తమమని వివరిస్తున్నారు.
ఫ్యామిలీ టూర్‌ను వాయిదా వేసుకున్నాం
- ఈ ఆదివారం మేం ఖిలా వరంగల్, లక్నవరం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. కానీ కర్ఫ్యూ విధించారు.
- ఉదయం వెళ్లి.. సాయంత్రం వరకు వచ్చే వీలున్నప్పటికీ కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ట్రిప్‌ను రద్దు చేసుకున్నాం.
- పరిస్థితులు కుదుటపడ్డాక వెళ్లాలని నిర్ణయించుకున్నాం.
- ఫ్యామిలీ సరదా కోసం ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయొద్దు. -దీప్తి, గృహిణి
లాంగ్ ట్రిప్‌ను వాయిదా వేసుకున్నాం
- ప్రతీ వీకెండ్ ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి స్నేహితులమంతా సరదాగా గడుపుతాం.
- కానీ ఈ సారి అనుకున్న లాంగ్ ట్రిప్‌ను వాయిదా వేసుకున్నాం.
- కొవిడ్ ప్రమాదం పొంచి ఉండటమే కారణం.
- దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.
- ఎక్కడికి వెళ్లినా కొవిడ్ ఉంది.
- ఇది సరదాల సమయం కాదు.
- జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం. – మధు, సాఫ్ట్వేర్
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

