టాటూ.. అదిరేట్టు..
నేను గోవాలో టాటూ ఆర్ట్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఇబ్రహీంపట్నం సమీపంలో స్కిన్వే టాటోస్టూడియో ప్రారంభించాను. బిజినెస్ మంచిగానే నడుస్తున్నది.
- యువతలో పెరుగుతున్న క్రేజ్పట్టణం నుంచి పల్లెలకు పాకిన ట్రెండ్
- అందుబాటులో ఆకట్టుకునే డిజైన్లు, కలర్లు
- అందరిలో వైవిధ్యంగా కనిపించేందుకు టాటూలపై ఆసక్తి చూపుతున్న యువతీ యువకులు
టాటూ.. పచ్చబొట్టు.. పేరేదైనా ఎప్పటి నుంచో ఇదొక ట్రెండ్. అది ప్రారంభమై దశబ్దాలు గడుస్తున్నా యూత్‌లో దానిపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడంలేదు. మనసులోని భావాలను శరీరంపై టాటూలుగా ముద్రించుకోవటం యూత్‌కు ఒక స్టయిల్, స్టేటస్‌గా మారింది. మోడ్రన్‌గా కనిపించడానికి టాటూలపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటివరకు నగరాలకే పరిమితమైన ఈ కల్చర్ నేడు గ్రామాలకూ పాకింది. అందరిలో వైవిధ్యంగా కనిపించాలని శరీరమంతా డిజైన్ వేయించుకుంటున్నారు. తమకు నచ్చినవారిపేర్లు, దేవుళ్లు, అభిమాన హీరోలు, కొటేషన్లు, కార్లు, బైక్‌లు ఇలా మనసుకు నచ్చిన వాటిని టాటూగా వేయించుకుంటున్నారు.
-ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 3
ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 3 : ప్రస్తుత కాలంలో టాటూ ట్రెండ్‌గా మారింది. ఒకప్పుడు విదేశాలు, దేశంలోని పెద్దపెద్ద నగరాల్లో మాత్రమే కనిపించిన ఈ కల్చర్ నేడు పట్టణాలు, గ్రామాలకూ పాకింది. నాడు పచ్చబొట్టు.. నేడు టాటూ పేరేదైనా నేటి యువతలో మాత్రం దీనిపై విపరీతమైన క్రేజ్ వచ్చింది. పెండ్లిళ్లు, యూత్ పార్టీలు, పండుగలు, గెట్ టు గెదర్ సందర్భం ఏదైనా ఒంటిపై టాటూ పడాల్సిందే. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు శరీరమంతా డిజైన్ వేయించుకుంటున్నారు. తమకు నచ్చిన వారిపేర్లు, దేవుళ్లు, అభిమాన హీరోలు, కొటేషన్లు, కార్లు, బైక్‌లు, రాజకీయ నాయకులు ఇలా మనసుకు నచ్చిన వాటిని టాటూగా ఎంచుకుంటున్నారు. తమ ఆలోచనా విధానం, సమాజంలో హాట్‌టాపిక్, ఫ్యాషన్, ప్రకృతి తదితర అంశాలను సెలక్ట్ చేసుకుంటున్నారు.
కొందరు స్టెల్ కోసం.. మరికొందరు ప్రేమను వ్యక్తపరిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగట్టు రకరకాల టాటూ డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. సింపుల్ టాటూ నుంచి రకరకాల బొమ్మల టాటూలు, నార్మల్, పర్మినెంట్ ఇలా అనేక విధాలుగా వస్తుండడంతో టాటూ లవర్స్ ఫిదా అవుతున్నారు. గతంలో డిజైనర్లు టాటూ కోసం పచ్చరంగు మాత్రమే ఉపయోగించగా, ఇప్పుడు అనేక రకాల రంగులను వినియోగించి యూత్‌ను ఆకట్టుకుంటున్నారు. మల్టీ కలర్స్‌తో లైఫ్‌లాంగ్ గుర్తుండేలా వేసుకోవడం ఎంతో క్రేజ్‌గా మారింది.
టాటూ రకాలు..
ఫెన్లైన్ టాటూ : విభిన్నమైన జంతువులు, పక్షులు, మనుషుల బొమ్మలను మీరనుకున్న థీమ్‌కు అనుగుణంగా మీ చేతులు లేదా భుజాల మీద వేయించుకోవచ్చు.
ట్రైబల్ టాటూ : సాలిడ్ గ్రాఫిక్స్ డిజైన్లతో మోడ్రన్ పెయింటింగ్స్‌ను శరీరంపై వేయించుకోవడం.
ట్రిబ్యూట్ టాటూ : ట్రిబ్యూట్ టాటూ ఏదైనా సంఘటనకు గుర్తుగానో లేదా.. ఇష్టమైన వారికి అంకితం చేస్తూ వేసుకుంటారు.
పెద్ద ఎత్తున వెలుస్తున్న టాటూసెంటర్లు..
గతంలో కేవలం నగరాలకే పరిమితమైన టాటూ కల్చర్ నేడు ప్రస్తుతం చిన్న పట్టణాలు, గ్రామాలకు సైతం విస్తరిస్తున్నది. ఒకప్పుడు జాతర్లల్లో ప్రత్యేక సమయంలో మాత్రమే పచ్చబొట్టు అందుబాటులో ఉండేది. కాని, నేడు టాటూలు వేసేందుకు ప్రత్యేక సెంటర్లు వెలుస్తున్నాయి. జిల్లా నగరానికి కూతవేటు దూరంలో ఉండడంతో ఇబ్రహీంపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో టాటూ సెంటర్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పలువురు యువకులు జీవనోపాధి పొందుతున్నారు.
క్రేజ్ బాగా పెరిగింది..
నేను గోవాలో టాటూ ఆర్ట్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఇబ్రహీంపట్నం సమీపంలో స్కిన్వే టాటోస్టూడియో ప్రారంభించాను. బిజినెస్ మంచిగానే నడుస్తున్నది. టాటూ డిజైన్‌ను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.8 వేల వరకు ఉంటుంది. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడం కోసం నేటి యువత టాటూలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం యువతలో ఎంతో క్రేజీ పెరిగింది. టాటూపై యువత పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు.
– అరుణ్‌కుమార్ వర్మ,టాటూ కళాకారుడు
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

