ఆషాఢం.. ఆఫర్లకు ఆహ్వానం
ఆషాఢ మాసం వచ్చిందంటే పర్వదినాలకు రంగం సిద్ధమవుతున్నట్టే. శ్రావణ మాసం నుంచి మొదలయ్యే పండుగల కోసం మహిళామణులు నెల రోజుల ముందు నుంచే సిద్ధమవుతారు.
- ప్రత్యేక రాయితీలతో ఆకట్టుకుంటున్న షాపింగ్ మాల్స్, జువెలర్స్, ఆటో మొబైల్స్
- కస్టమర్లతో సందడి తలపిస్తున్న వస్త్ర నిలయాలు
- మేకింగ్ ఛార్జీలు లేకుండా బంగారం ఆఫర్లు
- అందరూ మెచ్చే ధరల్లో బట్టలపై డిస్కౌంట్లు
సిటీబ్యూరో, జులై 19 (నమస్తే తెలంగాణ) : ఆషాఢ మాసం వచ్చిందంటే పర్వదినాలకు రంగం సిద్ధమవుతున్నట్టే. శ్రావణ మాసం నుంచి మొదలయ్యే పండుగల కోసం మహిళామణులు నెల రోజుల ముందు నుంచే సిద్ధమవుతారు. అందుకే వారు మెచ్చేలా వస్త్ర దుకాణాలు, ఆభరణాల నిలయాలు పోటీ పడి ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడానికి మహిళలు పెద్ద ఎత్తున షాపింగ్ కేంద్రాలకు తరలి వస్తుంటారు. సాధారణంగానే షాపింగ్ అంటే మక్కువ చూపే మహిళామణులకు ఆఫర్లు ఉన్నాయంటే వారిని ఆపగలమా! వీరి షాపింగ్‌కు తగ్గట్టుగావిభిన్న రకాల రాయితీలతో అనేక డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఉంటారు. చీరలు, నగలు, ఇంటికి అవసరమయ్యే పరికరాలు..ఇలా అన్నింటిపై అన్ని రంగాల షాపింగ్ మాల్స్ ప్రత్యేక రాయితీలు ఇప్పటికే ప్రకటించాయి. కేజీల లెక్కన చీరలు, ఒకటి కంటే మరొకటి ఫ్రీ వంటి ఆఫర్లు వస్త్రాలపై ఉంటే.. ఇంకొన్ని మాల్స్ ఏకంగా 50 శాతం నుంచి 70 శాతం వరకు రాయితీలు ప్రకటిస్తున్నాయి.
మనసు దోచే ఆభరణాలు
అలంకరణలో బంగారు ఆభరణాలది ప్రత్యేక స్థానం. సీజన్‌తో సంబంధం లేకుండా చెవి కమ్మల నుంచి వడ్డాణాల వరకు ప్రతీది ఓ ప్రత్యేకతే. ట్రెండ్‌కు తగ్గ డిజైన్స్‌ను పరిచయం చేయడానికి నగరంలో బ్రాండెడ్ జువెలరీ దుకాణాలు తమ బ్రాంచీలను విస్త్రృతం చేస్తున్నాయి. ముఖ ఆకారాన్ని ఆధారం చేసుకుని.. వయస్సును దృష్టిలో ఉంచుకుని..వర్కింగ్‌ను బట్టి, డ్రెస్సును ఆధారంగా చేసుకుని ఇలా విభిన్న రకాలుగా ఆభరణాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఎలాంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కొందరు, అతి తక్కువ మేకింగ్ చార్జీలతో మరికొందరు బంగారు ఆభరణాలపై అదిరిపోయే ఆఫర్లు ఇస్తున్నారు. సోమాజిగూడలోని ఓ నగల దుకాణం ఆషాఢం బంపర్ సేల్‌లో భాగంగా వీఏ మీద 20 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర వాటిపై కూడా వివిధ మాల్స్ విరివిగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
నచ్చిన ధరల్లో మెచ్చిన చీరలు
ఆషాఢంలో అన్నింటికన్నా ముఖ్యంగా మగువలను ఆకర్షించే బంపర్ ఆఫర్ ఏదైనా ఉంటే అది కేజీల్లో చీరలను విక్రయించడమే. కొన్ని షాపులు ఫ్యాన్సీ డ్రెస్సులపై 70 శాతం వరకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆషాఢం రాయితీల్లో భాగంగా ప్యాంట్, షర్ట్స్ లను కొన్ని మాల్స్ సగం ధరకే విక్రయిస్తున్నాయి. సికింద్రాబాద్, అమీర్‌పేట్, అబిడ్స్, దిల్షుక్ నగర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో వస్త్ర నిలయాలు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి.
ఆఫర్ ఉంటే.. మనసు అటువైపే
సాధారణంగా నగరంలో షాపింగ్ మాల్స్ ఏ రోజైన సందడిని తలపిస్తాయి. నగరవాసుల కొనుగోలు శక్తి పెరగడంతో వారు షాపింగ్, వినోదంపై అత్యధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. వీరి ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ తమ కార్యాలయాలను నగరంలో ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న షాపింగ్ మాల్స్‌కు దీటుగా ఒకే చోట వినోదం, షాపింగ్ ఉండేల మాల్స్ వెలుస్తున్నాయి. కుటుంబ సమేతంగా అవసరమయ్యేవన్నీ అందుబాటులో ఉంచుతున్నాయి. రిటైల్ స్పేస్‌లో వ్యవస్థీకృత మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నది. బ్రాండెండ్ దుకాణాల రాకతో వీటికి డిమాండ్ పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వినోదం, షాపింగ్, ఆహారం వరకు అన్నీ ఒకే చోట సౌకర్యంగా ఉండటంతో సందర్శకులు ఉదయం నుంచి రాత్రి వరకు మాల్స్‌లోనే గడుపుతున్నారు. ఆదాయాలు పెరగడం, జీవనశైలిలో వచ్చిన మార్పులు కూడా వీటికి బాగా కలిసోస్తుంది. బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఐటీ కారిడార్, దిల్సుఖ్నగర్ పరిమితమైన మాల్స్ సంస్కృతి నగరంలోని శివార్లకు పాకింది. ఫలితంగా హైదరాబాద్ షాపింగ్ దుకాణాలు తమ బ్రాండ్లను నగరవాసులకు పరిచయం చేయడంలో పోటీపడుతున్నాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

