కదిలారు.. తొలగించారు
గండిపేట కాలువ(క్యాండూట్) పై అక్రమ నిర్మాణాలపై జలమండలి విజిలెన్స్ అధికారులు విచారణ కోసం కదిలారు.
- గండిపేట కాలువపై అక్రమ నిర్మాణాల తొలగింపు
మణికొండ, జూలై 22: గండిపేట కాలువ(క్యాండూట్) పై అక్రమ నిర్మాణాలపై జలమండలి విజిలెన్స్ అధికారులు విచారణ కోసం కదిలారు. ఈ నెల 21న ‘నమస్తే’లో ప్రచురితమైన ‘వాటా ఇచ్చుకో.. వ్యాపారం చేసుకో’ కథనంపై జలమండలి ఉన్నతాధికారులు స్పందించారు. కమిషనర్ ఆదేశాల మేరకు స్థానిక సెక్షన్ -17 డీజీఎం నరహరితో జలమండలి విజలెన్స్ అధికారి లక్ష్మీరెడ్డి, సురేశ్ మణికొండ, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గండిపేట కాలువను సందర్శించారు. క్యాండూట్పై వెలసిన అక్రమ నిర్మాణాలు, వ్యాపార కేంద్రాలను తక్షణమే తొలగించేందుకు యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టారు.
కాలువ శిథిలావస్థకు చేరుకోవడానికి జలమండలి సిబ్బంది వైఖరే కారణమంటూ.. స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పుప్పాలగూడ బీఆర్సీ ఎదురుగా ఓ నిర్మాణ సంస్థ నిబంధనలను తుంగలో తొక్కుతూ క్యాండూట్పై నిర్మించిన పైకప్పు, టైల్స్‌తో పాటు రేకులను జేసీబీల సహాయంతో తొలగించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలు కొన్నింటిని తొలగించామని, మిగిలిన వాటిని స్థానిక పోలీసులు, మున్సిపల్ అధికారుల సహాయంతో తొలగిస్తామని జలమండలి విజిలెన్స్ అధికారులు లక్ష్మీరెడ్డి, సురేశ్ తెలిపారు. క్యాండూట్పై ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే..వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

