Guinness World Record | విద్యార్థులకు రియల్ పేజ్ ఇండియా 30,107 జతల బూట్ల విరాళం

- 6 కిలోమీటర్ల వరసలో బూట్లను అమర్చి గిన్నిస్ బుక్ రికార్డు
శేరిలింగంపల్లి : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రియల్ ఫేజ్ ఇండియా స్వచ్ఛంద సంస్ధ అధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో బాగంగా ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులకు 30,107 జతల బూట్లను విరాళంగా అందజే శారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ (సాట్స్) ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

ఆదివారం గచ్చిబౌలిలోని బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ‘‘రియల్ సోల్స్ ఫ్రమ్ రియల్ సౌల్స్’’ పేరిట ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో విరాళంగా అందజేయనున్న బూట్లను అథ్లెటిక్ ట్రాక్‌లపై 6.188 కిలోమీటర్ల వరుసక్రమంలో అమర్చి నూతన గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నారు.
సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా వివిద సాఫ్ట్వేర్ సంస్ధలకు చెందిన ఐటీ ఉద్యోగులు రియల్ ఫేజ్ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి రాష్ట్రంలోని దాదాపు 100 ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులకు 30,107 జతల బూట్లను అందజేయడం సంతోషకరమైన విషయమాన్నారు.
ఈ తరహా వినూత్న కార్యక్రమంలో గిన్నిస్ రికార్డును నెలకొల్పడం, దానికి గచ్చిబౌలి క్రీడా స్టేడియం వేదికగా మారడం గొప్ప విషయమన్నారు.

రియల్ ఫేజ్ ఇండియా సంస్థ ఏండీ సందీప్ శర్మ మాట్లాడుతూ రికార్డుల నెలకొల్పడం మాత్రమే ఈ కార్యక్రమ ఉద్ధేశం కాదని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యానభ్యసిస్తున్న పేద విద్యార్ధులకు షూస్ ను అందజేసి వారి ముఖంలో ఆనందాన్ని చూడాలనే మంచి సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహారించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిది స్వప్నిల్ దంగారికర్ ఈ సందర్భం గా మాట్లాడుతూ 2011లో అమెరికాలో 24,962 షూస్‌ను వరుసలో అమర్చి రికార్డు నెలకొల్పారని, నేడు తాజాగా గచ్చిబౌలి స్టేడియంలో రియల్ ఫేజ్ సంస్ధ ఆ రికార్డు అధిగమించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐటీ సంస్ధల ప్రతినిదులు, ఉద్యోగులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

