అన్నం పెట్టే రైతుకు ప్రాధాన్యం.. వికారాబాద్ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

- రైతు రాజ్యం దిశగా ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ
- ప్రతి 5 గ్రామాలకు ఒక క్లస్టర్ స్థాయి రైతువేదిక
- పంటలు పండించే విధానంలో అవగాహన
- నూతన వ్యవసాయ పోకడలపై నిరంతర పరిశీలన
దోమ : రైతు వేదికలే పల్లె ప్రగతి దీపికలుగా నిలుస్తాయని ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో క్లస్టర్‌స్థాయి రైతు వేదికను మండల ఎంపీపీ అనసూయ, వైస్ ఎంపీపీ మల్లేశంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు వేదికలే పల్లె ప్రగతి దీపికలని అవే రేపటి పల్లె ప్రగతికి బాటలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. రైతు రాజ్యం తీసుకురావాలనే సంకల్పంతో ఆ దిశగా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నదని పేర్కొన్నారు.
వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు పంటలు పండించే విధానంలో అవగాహన కల్పించాలని సూచించారు. మూస పద్దతికి ముగింపు పలికి మేలు రకం విత్తనం వేసి అధిక లాభాలు ఆర్జించాలన్నారు. ప్రభుత్వం నూతన వ్యవసాయ పోకడలపై నిరంతర పరిశీలనలు జరిపి రైతుల సంక్షేమానికి పెద్దపీఠ వేసి వారి అభ్యున్నతే లక్ష్యంగా కృషి చేస్తున్నదన్నారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మోత్కూర్ గ్రామానికి చెందిన ఎస్సీ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గునిగారి అంజిని ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి పరమార్శించి రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ నాగిరెడ్డి, మండల పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సురేందర్ కుమార్, గ్రంథాల డైరెక్టర్ యాదయ్యగౌడ్, మండల రైతుబంధు కో-ఆర్డినేటర్ లక్ష్మయ్య ముదిరాజ్ ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

