కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కీసరలోని భోగారం హోళిమేరి కళాశాలలో ఈ నెల 3వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సిటీబ్యూరో/మేడ్చల్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కీసరలోని భోగారం హోళిమేరి కళాశాలలో ఈ నెల 3వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం రాచకొండ సీపీ డీఎస్.చౌహన్, జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎస్.కె.జైన్, పూర్వాగార్గ్, అమన్ మిట్టల్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఏర్పాట్లను పరిశీలించారు.
కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాల్లో ఏర్పాటు చేసిన బారీకేడ్లను పరిశీలించి సూచనలు చేశారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా సాఫీగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 3వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రశాంతమైన వాతావరణం మధ్య నిర్వహించేలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. అధికారుల వెంట అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, డీసీపీ జానకి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

