బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగలు
గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే తోడుదొంగల పార్టీల నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
- ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీల నాయకులను తరిమికొట్టాలి
- రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలం
- తెలంగాణ రైతాంగంపై బీజేపీది సవతితల్లి ప్రేమ
- మాజీ మంత్రి హరీశ్‌రావు
- ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన ముద్విన్ బీజేపీ, బీఎస్పీ నాయకులు
కడ్తాల్, నవంబర్ 30 : గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే తోడుదొంగల పార్టీల నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మండలంలోని ముద్విన్ గ్రామంలోని బీజేపీకి చెందిన 60 మంది నాయకులు, కార్యకర్తలతోపాటు బీఎస్సీ మండల నాయకుడు మహేశ్ తదితరులు మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సమక్షంలో ఆదివారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసంలో ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుండడంతో.. గ్రామాల్లోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీజేపీకి 8 మంది ఎంపీలున్నా తెలంగాణకు ఒక్క మెడికల్ కళాశాలనూ తీసుకురాలేకపోయారని మండిపడ్డారు.
కేంద్రం పక్క రాష్ర్టాలకు రూ.వేల కోట్లు ఇస్తున్నా.. మన రాష్ర్టానికి నిధులు తీసుకురాలేక బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు చతికిలపడ్డారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగంపై బీజేపీ సవతితల్లి ప్రేమను చూపుతున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ముద్విన్, కడ్తాల్ గ్రామాల అధ్యక్షులు రాజు, రామకృష్ణ, మాజీ ఉప సర్పంచ్ వినోద్, నాయకులున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- BJP
- BRS
- BSP leaders
- Harishrao
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

