ధరణిలోని పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తాం

మేడ్చల్, జూన్ 5(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ధరణి పోర్ట్‌లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మేడ్చల్ జిల్లాకు సంబంధించిన పలు ఆంశాలపై కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడారు. భూములకు సంబంధించిన దరఖాస్తులు, పెండింగ్ మ్యుటేషన్లు అన్ని రకాల దరఖాస్తులను ప్రభుత్వం సూచించిన మేరకు ఈ నెల 9వ తేదీలోగా పరిష్కరిస్తామని తెలిపారు.
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణా పనులు తుది దశకు చేరాయని, మిగిలిన పనులు పూర్తి చేసేందుకు తానే స్వయంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని సీఎస్‌కు వివరించారు. ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు భూమిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ప్రాసెసింగ్ నిర్మాణాల వల్ల చాలా మందికి ఉపాధి లభించడమే కాకుండా రైతులు పండించిన పంటలకు మంచి ధర వస్తుందని, దీనిని అత్యంత ప్రాధాన్యతగా గుర్తించాలని సీఎస్ సోమేశ్ కుమార్ కలెక్టర్ శ్వేతా మహంతికి ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్యాంసన్ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

