ఈఎస్ఐ లో సిద్ధమవుతున్న ఐసొలేషన్ కేంద్రం

మేడ్చల్, మే 14(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అదనంగా మరో 250 బెడ్లతో ఐసొలేషన్ వసతి సౌకర్యాన్ని కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని రామంతాపూర్‌లోని హోమియో దవాఖానలో 100, పీర్జాదిగూడ మున్సిపాలిటీకి చెందిన భవనంలో 50 బెడ్లతో ఐసొలేషన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి 50 బెడ్లతో సౌకర్యం ఉన్న నాచారం ఈఎస్ఐ దవాఖానలో అదనంగా 250 బెడ్లతో ఐసొలేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
ఆక్సిజన్ కొరత లేకుండా వైద్య శాఖ పర్యవేక్షణ
ప్రభుత్వ దవాఖానలలో కొవిడ్ రోగులకు వైద్యం అందిం చే క్రమంలో ఆక్సిజన్ కొరత లేకుండా వైద్యశాఖ ప్రత్యేక్షంగా పర్యవేక్షిస్తుంది. అవసరమైతే ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని ఐసొలేషన్ కేంద్రాల పెంపుపై దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా వాక్సినేషన్ కేంద్రాలను పెంచారు. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి తదితర నియోజకవర్గాలలో 42 వాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి టీకాలు ఇస్తున్నారు. గతంలో 35 వాక్సినేషన్ కేంద్రాలు ఉండగా, ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు అదనంగా మరో 7 కేంద్రాలను ఏర్పా టు చేశారు. వీటిలో ప్రతి రోజు 10 వేల పైచిలుకు టీకాలు ఇస్తున్నట్లు మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు తెలిపారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

