సఫాయన్నకు సత్కారం
నగరంలోని అత్యంత సమస్యాత్మకమైన చెత్త కేంద్రాల్లో పని చేసిన పారిశుధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ ప్రశంసా పత్రాలతో సత్కరించింది.
- సమస్యాత్మక ప్రాంతాల్లో పని చేసిన పారిశుధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : నగరంలోని అత్యంత సమస్యాత్మకమైన చెత్త కేంద్రాల్లో పని చేసిన పారిశుధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ ప్రశంసా పత్రాలతో సత్కరించింది. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్మికులకు ప్రశంసా పత్రాలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రాస్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… పారిశుధ్య కార్మికుల కృషి వల్లనే జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీకి ఎన్నో అవార్డులు వచ్చాయన్నారు. చెత్త తరలింపులో బాధ్యతాయుతంగా వ్యవహరించిన కార్మికులకు ప్రోత్సాహకాలు ఇస్తామని, అవార్డులు సాధించిన కార్మికులు మిగతా వారికి స్ఫూర్తిని కలిగించాలని ఆమె అన్నారు.
నగరంలో 3400 జీవీపీలను గుర్తించామని కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. అలాగే చెత్తను ఆటోలకు ఇవ్వని కుటుంబాలను గుర్తించి వారి ఇంటికి వెళ్లి మెప్మాతో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎస్ఎఫ్ఏలను ఢిల్లీ వరకు తీసుకెళ్లి అవార్డును తీసుకున్నామన్నారు. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్లు ఉదయం ఆరు గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. కార్యక్రమంలో శానిటేషన్ యూసీడీ హెల్త్ అడిషనల్ కమిషనర్లు ఉపేందర్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, రవికిరణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

