వీకెండ్ హూషారు..
ఐదురోజులూ అమ్మానాన్న ఆఫీస్‌లో బిజీ.. ఉదయం పిల్లలను రెడీ చేస్తూనే నాలుగు ముక్కలు మాట్లాడేస్తున్నారు. మళ్లీ రాత్రి పడుకున్నాక ఇంటి తలుపు కొడుతున్నారు.
- వారాంతాల్లో పిల్లాపాపలతో కలిసి భోజనాలు
- స్నేహితులతో ఆటాపాట కార్యక్రమాలు
- వారం మొత్తం ఉత్సాహంగా ఉండేలా ప్రణాళిక
పెద్దఅంబర్‌పేట, డిసెంబర్ 16 : ఐదురోజులూ అమ్మానాన్న ఆఫీస్‌లో బిజీ.. ఉదయం పిల్లలను రెడీ చేస్తూనే నాలుగు ముక్కలు మాట్లాడేస్తున్నారు. మళ్లీ రాత్రి పడుకున్నాక ఇంటి తలుపు కొడుతున్నారు. మరోవైపు బ్యాగులు భుజాన వేసుకుని పుస్తకాలతో కుస్తీ పడే పిల్లలు.. ట్యూషన్లు, హోం వర్కులతో బిజీ.. అందుకే వారాంతాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. కారులో అలా షికారుకు వెళ్తున్నారు. పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. వారితో సమయాన్ని వెచ్చించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వన భోజనాలు, ఆలయ పరిసరాలు, జాతరలు, వినోద కార్యక్రమాల పేరుతో ఆనందంగా గడిపేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
జలాశయాలు.. ఆధ్మాత్మిక కేంద్రాలు
వారాంతాల్లో ముఖ్యంగా చెరువులు, జలాశయాల వద్ద పిల్లలతో కలిసి గడిపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. లేదంటే నగర శివారులోని పేరుగాంచిన ఆలయాల వద్దకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. లాంగ్ డ్రైవ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. జర్నీతోపాటు నీటి అందాల వద్ద పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. ఆ వారంలో జరిగిన ప్రత్యేక సందర్భాలను అడిగి తెలుసుకుంటున్నారు. పిల్లలతో చర్చలు పెడుతున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ సందర్భాన్ని చక్కటి అవకాశంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కలిసి భోజనాలు..
వారాంతాల్లో ఇంకొంతమంది వనభోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతా కలిసి ఒక చోట భోజనాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. వారంలో మిగతా రోజులు ఎవరికి వారే భోజనాలు చేస్తుంటారు. కానీ, వారాంతంలో పిల్లాపాపలతో కలిసి భోజనాలు తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు బయట హోటళ్ల నుంచి ఫుడ్‌ను ఆర్డర్ చేస్తున్నారు. బాక్సులు కట్టుకుని హుషారుగా గడిపేందుకు రెండ్రోజుల ముందు నుంచే పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇంకొందరు జలాశయాలు, ఆధ్యాత్మిక ప్రాంతాల వద్ద ఏర్పాటు చేసే హోటళ్లలో భోజనాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.
రిసార్టులు.. ఫాం హౌస్‌లు
నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు తమ పిల్లలతో కలిసి వారాంతాల్లో శివారుకు పరుగులు తీస్తున్నారు. రిసార్టులు, ఫాం హౌస్‌లలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకు తగ్గట్టు నగర శివారులో నలు దిక్కులా ఎన్నో పేరుగాంచిన రిసార్టులు ఉన్నాయి. మరెన్నో కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఒక్కసారి అందులోకి అడుగు పెట్టామంటే సమయం ఎలా గడిచిపోయిందో అర్థం కాకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాయి. మంచి భోజనాలతోపాటు పిల్లలు ఉత్సాహంగా గడిపేందుకు ఎన్నో వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకు కొన్ని రిసార్టుల్లో ఒకరికి రూ.4 వేల నుంచి 5 వేల వరకు తీసుకుంటున్నాయి. రిసార్టులో కల్పిస్తున్న వసతులు, అందించే వినోద కార్యక్రమాలు, పెట్టే భిన్నమైన ఆహార పదార్థాలు ఇలా అందించే సదుపాయాలను బట్టి రేటు పెడుతున్నాయి. అయినప్పటికీ చాలామంది రిసార్టులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. రెయిన్ డ్యాన్స్, స్విమ్మింగ్ అంటూ పిల్లలతో గడిపేందుకు ఇష్టపడుతున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- enjoy
- soft ware jobs
- weekend
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

