జిల్లాలో పాడిపరిశ్రమ అభివృద్ధికి కృషి

కులకచర్ల : జిల్లా పాడి పరిశ్రమ అభివృద్ధికి డీసీసీబీ ద్వారా కృషిచేస్తున్నామని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కులకచర్ల రైతు వేదిక భవనంలో డెయిరీ ఉత్పత్తిపై రైతులకు డీసీసీబీ బ్యాంకు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీసీసీబీ ద్వారా ముందుగా వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల మండలాన్ని మోడల్‌గా చేసి విడుతలవారీగా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
డీసీసీబీ ద్వారా మరింత ప్రోత్సాహం
ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం కల్పిస్తున్నదని, డీసీసీబీ ద్వారా మరింత ప్రోత్సాహం అందించేందుకు తమవంతు కృషిచేస్తామని తెలిపారు. దీనికిగాను గ్రామాల్లోని మహిళా సంఘాల్లో ఉన్న పాడి, అర్హత ఉన్న మహిళలు ఐదుగురితో జేఎల్‌జీ గ్రూపుగా తయారుచేసి వారికి డీసీసీబీ ఆధ్వర్యంలో నాబార్డుద్వారా పశువులను కొనుగోలు చేసేందుకు రుణాలు అందజేస్తామని తెలిపారు. అర్హుల జాబితాను తయారు చేసేటప్పుడు వారు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించినవారికి ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కులకచర్ల మండలంలో విజయవంతం చేయాలని రైతులను కోరారు. పాల ఉత్పత్తిని పెంచడంతోపాటు రైతులకు వ్యవసాయంతోపాటు అదనంగా పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు డీసీసీబీ ద్వారా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
పాల ఉత్పత్తి రుణాలకు సబ్సిడీ ఉండదు
డీసీసీబీ ద్వారా పాల ఉత్పత్తికి అందజేస్తున్న రుణాలకు ఎలాంటి సబ్సిడీ ఉండదని, తీసుకున్న రుణాలు వాయిదాల ప్రకారం చెల్లించాలన్నారు. రుణాలు అందించేందుకు ప్రజాప్రతినిధులు అర్హత ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఖాదీ బోర్డు ద్వారా జిల్లాలో వివిధ రకాల రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదన్నారు. స్త్రీలకు 35శాతం, పురుషులకు 25శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్‌నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు సుధాకర్‌రెడ్డి, రాంరెడ్డి, అధికారులు షఫీ, శైలజ, పీఏసీఎస్ డైరెక్టర్లు, వివిధ గ్రామాల రైతు బంధు సమితి అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

