బూస్టర్ డోస్ తీసుకోండి
దేశంలో కరో నా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకుంటున్నది. అర్హులందరికీ ముందస్తుగా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది.
- రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అందుబాటులో 53 వేల డోసులు
- పీహెచ్సీ, యూపీహెచ్‌సీలు, ప్రభుత్వ దవాఖానాలకు టీకా పంపిణీ
- కరోనా కేసుల నియంత్రణపై రాష్ట్ర సర్కారు అప్రమత్తం
- 12 ఏండ్ల్లు పై బడిన వారూ తీసుకోవచ్చు :జిల్లా వైద్యాధికారి
రంగారెడ్డి, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : దేశంలో కరో నా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకుంటున్నది. అర్హులందరికీ ముందస్తుగా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాకు 53వేల డోసులను పంపిణీ చేసింది. వీటిని వైద్య శాఖ జిల్లా అధికారులు సర్కారు దవాఖానలకు సరఫరా చేసి వ్యాక్సినేషన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అర్హులు గతంలో తీసుకున్న టీకా వివరాలు లేదా ఆధార్‌కార్డు తీసుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు. గతంలో కొవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. కార్బోవాక్స్ తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 12 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు.
కేసుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు
కరోనా కేసుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మరోసారి వైరస్ సోకకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని పలు చోట్ల ఇటీవల కరోనా వైరస్ నియంత్రణపై మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో కరోనా కేసులు పెరిగిన పక్షంలో గచ్చిబౌలి టిమ్స్‌లో ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్స్, ఐసీయూ విత్ వెంటిలేటర్ బెడ్స్‌ను సిద్ధం చేసి ఉంచారు. అలాగే జిల్లాలోని కొండాపూర్, వనస్థలిపురంలోని ఏరియా ఆస్పతులు, ఇంకా టిమ్స్ ఆస్పత్రిలో చికిత్సకు వైద్యులు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ లక్షణాలున్న వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ర్యాపిడ్, పీపీఈ కిట్లు, సిబ్బందిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే అధికారులు తీసుకుంటున్న చర్యల ఫలితంగా జిల్లాలో కరోనా ప్రభావం ఎక్కడా లేదు.
మరోసారి…
కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే మూడు విడుతలుగా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. మొదటి, రెండో డోస్‌తో పాటు బూస్టర్ డోస్ అందించింది. రంగారెడ్డి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కరోనా కేసులు తగ్గిపోయాయి. ఇటీవల మళ్లీ దేశ వ్యాప్తం గా కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగా మరో విడత బూస్టర్ డోస్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. జిల్లాకు 53 వేల డోసుల కార్బోవాక్స్ (‘బయోలాజికల్ – ఈ’ తయారీ) వ్యాక్సిన్ రాగా, వైద్య శాఖ అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టీకాలను పంపిణీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి
రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అర్హులంతా బూస్టర్ డోస్ తీసుకోవాలి. అన్ని పీహెచ్సీ, యూపీహెచ్సీ, ప్రభుత్వ దవాఖానాల్లో టీకాను ఉచితంగా అందిస్తున్నాం. ప్రజలు కొవిడ్ నిబంధనలను విధిగా పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ లక్షణాలున్న వారు ప్రభుత్వ దవాఖానాల్లో పరీక్షలు చేయించుకోవాలి. కొవిడ్ సోకిన వారికి మందులు, చికిత్స అందిస్తున్నాం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ వెంకటేశ్వర్ రావు, జిల్లా వైద్యాధికారి, రంగారెడ్డి
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

