హామీలు నెరవేర్చని కాంగ్రెస్
ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఒక్క హామీనీ సంపూర్ణంగా అమలు చేయలేదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు. సోమవారం పరిగిలో కులకచర్ల మండలం పీరంపల్లికి చెందిన 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మహేశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
- పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
పరిగి, మే 19 : ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఒక్క హామీనీ సంపూర్ణంగా అమలు చేయలేదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు. సోమవారం పరిగిలో కులకచర్ల మండలం పీరంపల్లికి చెందిన 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మహేశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలోకి రావాలనే ఏకైక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరిట అలవికాని హామీలిచ్చిందన్నారు.
అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు చేయకుండా, కేవలం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని, ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరిగిందన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడతామని తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతి కుటుంబానికి మేలు చేకూరిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు రాజు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

