మొక్కుబడి..
జిల్లాలో విద్యాశాఖ చేపట్టిన బడిబాట కార్యక్రమం మొక్కుబడిగానే ముగిసింది. ఈ నెల 6న ప్రారంభమైన ప్రోగ్రామ్ ఈనెల 19తో ముగిసింది. ఈ సందర్భంగా 7,697 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందినట్లు అధికారులు చెబుతున్నారు.
- ఈ నెల 19తో ముగిసిన బడిబాట కార్యక్రమం
- రంగారెడ్డి జిల్లాలోని బడుల్లో చేరిన విద్యార్థులు అరకొరే
- ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్య 7,697 మందే
- గతేడాది కంటే తగ్గిన ప్రవేశాలు
- ప్రభుత్వం సరిగా దృష్టి పెట్టకపోవడమే కారణం!
రంగారెడ్డి, జూన్ 20 (నమస్తే తెలంగాణ): జిల్లాలో విద్యాశాఖ చేపట్టిన బడిబాట కార్యక్రమం మొక్కుబడిగానే ముగిసింది. ఈ నెల 6న ప్రారంభమైన ప్రోగ్రామ్ ఈనెల 19తో ముగిసింది. ఈ సందర్భంగా 7,697 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే ప్రవేశాల సంఖ్య తక్కువగా ఉన్నది. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టకపోవడం..ఇందులో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం సైతం అంతంత మాత్రంగానే ఉండడంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల మొగ్గు చూపనట్లు తెలుస్తున్నది.
గతేడాది కంటే ఈసారి తక్కువే ..
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా విద్యాశాఖ ప్రతి ఏటా స్కూళ్లు తెరిచిన తర్వాత బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అయితే ఈసారి గతానికి భిన్నంగా విద్యార్థులు అరకొరగానే బడిబాట పట్టారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్ర భుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దింది. మన ఊరు-మన బడి కార్యక్రమంతో అనేక మౌలిక వసతులను కల్పించింది. ఇదే క్రమంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ‘అమ్మ ఆదర్శ కమిటీ’లను ఏర్పాటు చేసి మరమ్మతులు చేపట్టిం ది.
కానీ..చాలా వరకు పాఠశాలల్లో నేటికీ పూర్తికాక అస్తవ్యస్థంగా ఉన్నాయి. మరోపక్క పాఠశాలలు తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీకి ప్రభు త్వం చర్యలు తీసుకున్నా ఆశించిన స్థాయిలో ప్రవేశాలు జరుగకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తున్నది. గతేడాది బడిబాట కార్యక్రమంలో 10,228 మంది ప్రవేశాలు పొం దారు. కానీ..ఈసారి 7,697 మందికే పరిమితమైంది. అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటోతరగతిలో చేరిన వారు 4,245 మంది ఉండ గా.. ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చిన వారు 339 మందే ఉన్నారు. వారంతటగా వారే వచ్చి చేరిన విద్యార్థులు 3,113 మంది ఉన్నారు.
దృష్టి సారించకపోవడమే కారణం..
కేసీఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా వసతులు కల్పించడంతోపాటు ఆంగ్ల మాధ్యమంలో బోధన, సాం కేతిక విద్యవంటి అనేక విభిన్న పద్ధతులను ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బడిబాట కార్యక్రమంపై సరిగ్గా దృష్టి పెట్టకపోవడం..అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం మొక్కుబడిగానే పాల్గొనడంతో విద్యార్థుల నుంచి స్పందన అంతగా రాలేకపోయింది.
మరోవైపు ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ కొనసాగడం..బదిలీల హడావిడి నెలకొన్న నేపథ్యంలో ఉపాధ్యాయులు అనుకున్న స్థాయిలో దృష్టి సారించలేకపోయారు. ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ కమిటీలను భాగస్వామ్యులను చేయడంలోనూ విఫలమయ్యారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బడిబాట కార్యక్రమం ఈసారి మొక్కుబడిగానే సాగింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపడ్డ వసతులు, బోధనా నైపుణ్యాలపై ఉపాధ్యాయులు ఇంటింటికెళ్లి చెప్పి విద్యార్థుల తల్లిదండ్రుల్లో చైతన్యం తెచ్చే దిశగా చొ రవ చూపలేకపోయారు.
రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకుల్లో ప్రతిభ కనబర్చడం, ట్రిపుల్ ఐటీ, జాతీయ ఉపకార వేతనాలకు అర్హత పొందడంలోనూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ముందు వరుసలో ఉంటున్నారన్న విషయాన్ని వారికి సమగ్రంగా వివరించలేకపోయారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ వంటి విషయాలను సవివరంగా వివరిస్తే..చాలావరకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపేవారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ‘బడిబాట’ను మరి కొన్ని రోజులు కొనసాగించి, ప్రవేశాలు ఆశాజనకంగా ఉండేలా చర్యలు చేపడతామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

