వదల బొమ్మాళీ.. వదల
ఎలివేటెడ్ భూ బాధితులను అధికారులు వెంటాడుతూనే ఉన్నారు. ఓవైపు ప్రాజెక్టు వెడల్పు తగ్గింపు, భూముల పరిహారం తేల్చేంతవరకు భూములు ఇచ్చేది లేదని బాధితులు చెబుతున్నా... అధికారులు మాత్రం వదల బొమ్మాళీ అంటూ వేధిస్తూనే ఉన్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఎలివేటెడ్ భూ బాధితులను అధికారులు వెంటాడుతూనే ఉన్నారు. ఓవైపు ప్రాజెక్టు వెడల్పు తగ్గింపు, భూముల పరిహారం తేల్చేంతవరకు భూములు ఇచ్చేది లేదని బాధితులు చెబుతున్నా… అధికారులు మాత్రం వదల బొమ్మాళీ అంటూ వేధిస్తూనే ఉన్నారు. ప్రాజెక్టుకు భూములు ఇవ్వలేమని ఇప్పటివరకు చేపట్టిన అభిప్రాయ సేకరణతోపాటు, గ్రామ సభల్లో కూడా వ్యతిరేకించిన వందలాది భూ బాధితులకు అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. అయినా బాధితుల నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా ఫోన్‌కాల్స్ ద్వారా బాధితులను కార్యాలయానికి రప్పించే పనిలో పడ్డారు అధికారులు. ఈ క్రమంలో బాధితులకు వ్యక్తిగతంగా ఫోన్ల ద్వారా సంప్రదిస్తున్న యంత్రాంగం భూ సేకరణ జరిగేంత వరకు నోటీసులు జారీ చేస్తూనే ఉంటామని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో అధికారుల చర్యలకు బాధితులు కూడా దీటుగా బదులిస్తున్నారు.ఈ అంశం కోర్టు పరిధిలో ఉందంటూ, ప్రాజెక్టు వెడల్పు కారణంగా తమ జీవనాధారమే కోల్పోతున్నామని.. ఎట్టిపరిస్థితుల్లోనూ పరిహారంపై ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతనే కార్యాలయాలకు వస్తామని తేల్చిచెబుతున్నారు.
ఏడాదిగా కొనసాగుతున్న కుంపటి..
వందలాది మంది భూ యజమానులపై కాంగ్రెస్ సర్కార్ పెట్టిన ఎలివేటెడ్ కుంపటి ఆందోళనకరంగా మారుతోంది. జేబీఎస్ నుంచి శామీర్‌పేట్, ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం మార్గంలో భూ సేకరణకు గడిచిన ఏడాది కాలంగా అధికారులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మొత్తం 18 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1,500 ఆస్తులు నేలమట్టం అవుతుండగా.. ప్రాజెక్టు వెడల్పును 200 నుంచి 100 ఫీట్లకు తగ్గించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా పరిహారంపై స్పష్టతనివ్వకుండా దోబూచులాడుతున్నది. దీంతోనే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా రాజీవ్ రహదారి భూబాధితుల జేఎసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం బాధితుల వాదన పట్టించుకోకుండా, అధికారిక వేధింపులకు పాల్పడుతుండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.
కార్యాలయానికి రావాలంటూ ఫోన్ కాల్స్
భూముల సేకరణ కోసం రెండు జిల్లాల రెవెన్యూ యంత్రాంగం పదుల సంఖ్యలో నోటీసులు, గ్రామసభలు, అభిప్రాయ సేకరణ వంటి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించారు. వీటిలో ఏ ఒక్క సమావేశానికి కూడా బాధితులు పూర్తిస్థాయిలో హాజరు కాలేదు. హాజరైనవారు సైతం.. ప్రాజెక్టు వెడల్పు, పరిహారం వంటి డిమాండ్లకు అంగీకరిస్తేనే.. భూ సేకరణ అంశంపై మాట్లాడుదామంటూ తేల్చిచెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఈ అంశాన్ని పట్టించుకోకుండా.. నోటీసులు జారీచేస్తూనే ఉన్నది. దీంతోపాటు తాజాగా వ్యక్తిగత ఫోన్‌కాల్స్ ద్వారా మండల రెవెన్యూ కార్యాలయాలకు రావాలంటూ పిలుస్తున్నారు. ఇప్పటికే సర్కారు భూసేకరణ అంశంలో వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా వందలాది మంది హైకోర్టును ఆశ్రయించి, స్టే ఆర్డర్లు తీసుకున్నారు. తమ డిమాండ్లను ఆమోదించేంత వరకు ఆస్తులను కూల్చకుండా కోర్టుల ద్వారా రక్షణ పొందుతున్నా.. అధికారులు మాత్రం బాధితులను ఏదో ఒక రకంగా భయాందోళనకు గురిచేసే చర్యలకు దిగుతూనే ఉన్నారు. తాజాగా ఫోన్ కాల్స్ విషయంలోనూ బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత సమాచారం లేకుండా, ప్రైవసీ సమావేశాలకు హాజరుకాలేమని అధికారులకు తేల్చి చెప్పాలని జేఎసీ సమావేశంలో కార్యవర్గ సభ్యులు తీర్మానించినట్లుగా తెలిసింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
Farmer | ‘రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు’
Annamayya Song | ఇంటర్నేషనల్ స్టేజ్‌పై మార్మోగిన అన్నమయ్య కీర్తన.. ‘బ్రహ్మమొక్కటే’ పాటకు గూస్బంప్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

