యాచారం, డిసెంబర్ 26: అతడు కుంచె పడితే జీవం ఉట్టిపడాల్సిందే ..అతడి కుంచె నుంచి జాలువారిన చిత్రాలు అద్భుతం. అతను గీసిన ప్రతి బొమ్మా ఆలోజింపజేస్తుంది. ఇప్పటికే పలు రకాల చిత్రాలను గీసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు మండలంలోని మేడిపల్లి గ్రా మానికి చెందిన దోస మధుకర్. పిట్ట కొంచె కూ త ఘనం అన్నట్లు.. చిన్నతనం నుంచే బొమ్మ లు గీయడం అంటే అతడికి ఎంతో ఇష్టం. తన ఇష్టాన్ని అనుకూలంగా మార్చుకొని అద్భుతాలను సృష్టిస్తున్నాడు.
పాఠశాల స్థాయి నుంచే మధుకర్ పెన్సిల్‌తో బొమ్మలు వేయడం నేర్చుకున్నాడు. చదువుకునే రోజుల్లో ఖాళీ సమయాల్లో పెన్ను, పెన్సిల్‌తో తన ఊహల్లోకి వచ్చిన చిత్రాలను గీసేవాడు. అతడు గీసిన చిత్రాలు అందంగా, అద్భుతం గా ఉంటుండటంతో అందరితో ప్రశంసలు పొందుతున్నాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లు చిత్రలేఖనంలో అంచెలంచలుగా ఎదిగాడు. గతంలో మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెన్సిల్‌తో ఎన్నో రకాల బొమ్మ లు వేసి పలుమార్లు ఉపాధ్యాయుల ప్రశంసలు పొంది జ్ఞాపికలను అందుకున్నాడు. అదేవిధంగా గున్గల్ ఆద ర్శ పాఠశాలలో అనేక బొమ్మలు గీసి అవార్డులు పొందా డు. కొత్తపేటలో జరిగిన జిల్లా స్థాయి చిత్రలేఖనం పోటీ ల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లైవ్ ఆయిల్ పెయింట్ వేసి ఉత్తమ చిత్రకారుడి అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు చిత్రలేఖనంలో రాణిస్తున్నాడు. పేపర్‌పై బొ మ్మలు వేయడమేకాదు..గోడలపై బొమ్మలు వేయడం లోనూ అతడు దిట్ట. వాల్ పెయింటింగ్‌తోపాటు ఫొటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అతడి సొంతం. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసిన మధుకర్ ప్రస్తుతం కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు. అతడు దేవుళ్లు, దేశ నాయకులు, జంతువులు, పక్షులు, కోటలు, మనుషులతోపా టు ప్రకృతిఅందాలకు సంబంధించిన బొమ్మలు వేసి ఆకట్టుకుంటున్నాడు. మధుకర్ చిత్రలేఖన నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. హోటళ్లు, నూతన గృహాలు, పాఠశాలల్లో అతను గీసిన బొ మ్మ లు, వాల్ పెయింటింగ్స్ ఎంతో అబ్బురపరుస్తున్నాయి. కొంతమంది అతడితో తమ ఫొటోలను ప్రత్యేకంగా గీయించుకుంటున్నారు.
చిత్రలేఖనంలో రాణించడం గర్వంగా ఉంది
చిత్రలేఖనంలో రాణించడం ఎంతో గర్వంగా ఉంది. ఎలాంటి శిక్షణ లేకుండానే బొమ్మలు గీయడం రావడం నా అదృష్టంగా భా విస్తున్నా. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే బొమ్మలు గీయడం నేర్చుకున్నా. ఖాళీ సమయాల్లో బొమ్మలు గీయడం అలవాటుగా మారింది. చిత్రలేఖనంతో ఎం తో అనుభూతిని పొందుతు న్నా. బొమ్మలు వేయడం ద్వా రా మానసిక ప్రశాంతత దొరుకుతున్నది. భవిష్యత్తులో చిత్రలేఖనంలో మరింతగా రాణి స్తా. అద్భుతమైన చిత్రకళతో మరిన్ని బొమ్మలకు జీవం పోస్తా. – మధుకర్, చిత్రకారుడు మేడిపల్లి