అంగవైకల్యం మనస్సుకు కాదు
అంగవైకల్యం అనేది శరీరానికే గాని, మనస్సుకు కాదని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నా రు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్‌గ్రౌండ్‌లో మహిళా, శిశు, దివ్యాంగు ల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యం లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవా న్ని పురస్కరించుకుని దివ్యాంగులకు క్రీడా పోటీలను నిర్వహించారు.
వికారాబాద్, నవంబర్ 25: అంగవైకల్యం అనేది శరీరానికే గాని, మనస్సుకు కాదని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నా రు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్‌గ్రౌండ్‌లో మహిళా, శిశు, దివ్యాంగు ల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యం లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవా న్ని పురస్కరించుకుని దివ్యాంగులకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి జిల్లా అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించి మాట్లాడా రు.
డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని దివ్యాంగులందరికీ జిల్లా స్థాయి ఆటల పోటీలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తామూ నిలబడాలని కోరుకోవడమే కాక.. వారిలోని ఆత్మైస్థెర్యాన్ని పెంచేందుకు ఇలాంటి పోటీలను నిర్వహించడం చాలా మంచిదన్నారు.
ప్రభుత్వం మహిళా, శిశు, సంక్షేమ శాఖ తరఫున దివ్యాంగులకు అవసరమైన వసతులను కల్పిస్తూ వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నదనన్నారు. అనంతరం జిల్లా సంక్షేమశాఖ అధికారి లలితకుమారి మాట్లాడుతూ సుమారు 120 మం ది దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం షాట్‌ఫుట్, రన్నింగ్, చెస్, క్యారమ్స్, వీల్ చైర్స్ తదితర పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు వెళ్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో అదనపు పీడీ నర్సింహులు, చైల్డ్ డెవలప్మెంట్ అధికారి వెంకటేశ్వరమ్మ, పీఈటీలు, డీవైఎస్వో, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

