టిక్ టాక్ దుర్గారావుతో చిందులేసిన బస్తీ బాలరాజు
ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు హీరోలు. ఇప్పుడు హీరో కార్తికేయ కూడా ఇదే చేశాడు. ఈయన నటించిన ‘చావు కబురు చల్లగా’ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గీతాఆర్ట్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఆ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమాకు ప్రమోషన్ కూడా అలాగే చేస్తారు.

ఇప్పుడు ‘చావు కబురు చల్లగా’ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. విడుదలకు పది రోజుల ముందు నుంచి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా కాకినాడ వెళ్లిన చిత్ర యూనిట్ అక్కడ ప్రేక్షకుల మధ్యలోకి వెళ్లి డ్యాన్స్ చేశారు.

అక్కడ పద్మప్రియ థియేటర్‌కు వెళ్లిన కార్తికేయ, లావణ్య త్రిపాఠి ఆడియన్స్‌తో కలిసిపోయారు. తమ సినిమా ముచ్చట్లు వాళ్లతో పంచుకున్నారు. అంతేకాదు ఈ ప్రమోషన్లు టిక్ టాక్ దుర్గారావు కూడా ఉన్నాడు. చావు కబురు చల్లగా హీరో కార్తికేయతో కలిసి రోడ్డుపై డాన్సులు చేశాడు దుర్గారావు. తన సినిమా ప్రమోషన్ కోసం కార్తికేయ కూడా అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఈ సినిమాలో బస్తీ బాలరాజు అనే మాస్ క్యారెక్టర్లో నటించాడు కార్తికేయ.

తాజాగా విడుదలైన ప్రోమో సాంగ్‌లో మామూలు మాస్ డాన్స్ చేయలేదు. కచ్చితంగా చావు కబురు చల్లగా ప్రేక్షకులను అలరిస్తుందని ధీమాగా చెబుతున్నాడు కార్తికేయ. ఆర్ఎక్స్ 100 తర్వాత తన కెరీర్లో దాన్ని మరిపించే హిట్టవుతుందని చెప్తున్నాడు ఈ హీరో. చేస్తున్న ప్రమోషన్ చూస్తుంటే సినిమాలో విషయం కూడా గట్టిగానే ఉన్నట్లు అర్థమవుతోంది. కొత్త దర్శకుడు కౌశిక్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
Read Today's Latest Photo-gallery News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

