మంగళవారం 31 మార్చి 2020
Peddapalli - Jan 12, 2020 , 03:23:28

ఇష్టపడి చదివితే విజయం మీదే

ఇష్టపడి చదివితే విజయం మీదేధర్మారం: పదో తరగతి విద్యార్థులు ఇష్టపడి చదివితే విజయం సొంతమవుతుంద ని పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్‌ పేర్కొన్నారు. ధర్మారం మండలంలోని నందిమేడారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఏసీపీ సందర్శించి పదోతరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు కామన్‌బోర్డు పరీక్ష ఒక తొలిమెట్టు లాంటిదన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఒత్తిడి లేకుండా మానసిక ప్రశాంతతో చక్కగా చదివితే ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. పరీక్షలకు 67 రోజులు మాత్రమే ఉన్నందున ప్రతి విద్యార్థి రోజూ 10 నుంచి 12 గంటలు ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని వివరించారు. ఇప్పటి నుంచి సమయం వృథాకాకుండా విద్యార్థులు జాగ్రత్త పడాలని సూచించారు. బాలురు చిన్నగా క్షవరం చేయించుకొని క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల న్నారు. పాఠశాలలో పదోతరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు తనవంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు ఏసీపీ బోర్డుపై గణిత బోధన చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉమర్‌ అలీ, జిల్లా పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ. సలామొద్దీన్‌, ఎంపీటీసీ సభ్యుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్ట తిరుపతి, టీఆర్‌ఎస్‌ నాయకుడు దేవిరమణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>