కుక్కకు సందిస్తే.. మూతులు నాకిందట
కొందరు మంచితనాన్ని తేలిగ్గా తీసుకుంటారు. తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నామని కూడా గుర్తించరు. చనువిచ్చిందే చాలు సంకలోకి ఎక్కుతుంటారు. సరిగ్గా అలాంటి వారిని ఉద్దేశించి అనుభవపూర్వకంగా చెప్పిన సామెత.. ‘కుక్కకు సందిస్తే.. మూతులు నాకిందట’.
కొందరు మంచితనాన్ని తేలిగ్గా తీసుకుంటారు. తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నామని కూడా గుర్తించరు. చనువిచ్చిందే చాలు సంకలోకి ఎక్కుతుంటారు. సరిగ్గా అలాంటి వారిని ఉద్దేశించి అనుభవపూర్వకంగా చెప్పిన సామెత.. ‘కుక్కకు సందిస్తే.. మూతులు నాకిందట’. అల్పులకు అతి చనువిచ్చి, అవకాశాలు కల్పించి, మన పతనానికి మనమే పరోక్షంగా కారణమైనప్పుడు ఇలాంటి సామెతలతో సున్నితంగా హెచ్చరిస్తుంటారు పెద్దలు. అతి చనువు కూడా ప్రమాదకరమే.
ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలియకపోతే.. ఎదుటివారిని గుడ్డిగా నమ్మితే వచ్చే అనర్థాలను గుర్తుచేస్తుంది ఈ సామెత. కుక్క మన దగ్గరికి వచ్చినప్పుడు చేతులు వాసన చూస్తుంది. ఆ తర్వాత నాకడానికి ప్రయత్నిస్తుంది. అప్పటికీ ఏమీ అనకపోతే.. నేరుగా మూతి నాకేందుకు ముందుకొస్తుంది. వక్రబుద్ధి ఉన్నవాళ్లను చేరదీసి.. ఇబ్బందులు పడటం అంటే ఇదే. అందుకే ఎవరికైనా ఏదైనా అవకాశం ఇస్తున్నప్పుడు ప్రవర్తన, గుణగణాలు చూసి ఇవ్వాలని సున్నితంగా హెచ్చరిస్తారు పెద్దలు.
Read Today's Latest Palukubadulu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

