దూపయినప్పుడే బాయి తవ్వుకున్నట్లు
భవిష్యత్ గురించి ఎలాంటి ప్రణాళికలూ లేనివ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు. ఆ పూట గడిస్తే చాలనుకుంటారు. రేపు అలాంటి సమస్యే మరొకటి వస్తే.. ‘మళ్లీ వచ్చినప్పుడు చూద్దాం’ అనుకునే రకం. తీరా నెత్తిమీదికొచ్చినప్పుడు నానా తంటాలు పడతారు. సరిగ్గా అలాంటి వారిని ఉద్దేశించి చెప్పిన సామెతే ‘దూపయినప్పుడే బాయి తవ్వుకున్నట్లు’. వాళ్లంతే. ప్రతిదాన్నీ వాయిదా వేస్తుంటారు. చేసే పనిని కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయరు. అత్యవసరం అనుకుంటే తప్ప మొదలుపెట్టరు. ఒకవేళ మొదలుపెట్టినా ఆరంభశూరత్వమే. ఏదీ కార్యరూపం దాల్చదు. నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణం. నీరే సర్వకోటికి ప్రాణాధారం. అలాంటిది, దూప అయినప్పుడే బావి తవ్వుకోడం ఎంత అవివేకం! అందుకే చేసే పనిని వాయిదా వేయకుండా, ఓ ప్రణాళికతో పూర్తి చేయాలంటారు పెద్దలు.
అదునెరిగి సేద్యం.. పదునెరిగి పైరు వెయ్యాలి

ఇది వ్యవసాయ సంబంధమైన సామెత అయినా.. అన్ని రంగాల్లో, అన్ని పనులకూ వర్తిస్తుంది. చేసేది ఏ పనైనా.. చివరికి విజయవంతం కావాలంటే.. ఆరంభించే ముందే సరైన అధ్యయనం ఉండాలి. పని మొదలు పెట్టాల్సిన అనుకూల సమయం ఏమిటి? ఎలాంటి వనరులు కావాలి? ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?.. అనే విషయాలు తెలుసుకుంటూనే.. ఆ రంగంలో విజయవంతమైనవారి సలహాలు, సూచనలు తీసుకోవాలి. లేకపోతే మొదలు పెట్టిన పని విఫలం అవుతుంది. ‘అదునెరిగి సేద్యం’ అంటే .. భూమిలో సాగు చేయాలనుకున్నప్పుడు వాతావరణ అనుకూలతలు, సమయాలు చూసుకోవాలి. ‘పదునెరిగి పైరు’ అంటే.. వ్యవసాయానికి భూమి, వాతావరణం అనుకూలంగా ఉంటేనే పైరు వెయ్యాలి. అదునుదాటితే పంట చేతికిరాదు. దీనివల్ల శ్రమ వృథా అవుతుంది. దీనినే
‘బూడిదలో పోసిన పన్నీరు’ అంటారు పెద్దలు.
పెయ్యిపొంట ముండ్లొస్తయ్

‘వాని ముకం చూస్తేనే పెయ్యిపొంట ముండ్లొస్తున్నయ్. నా కళ్లముందు లేకుండా జల్ది ఎల్లమను’ అంటుంటారు ఇష్టం లేని వ్యక్తులను చూసినప్పుడు. ఎదుటి మనిషి నమ్మక ద్రోహమో, మోసమో చేసినప్పుడే.. ఆ మనిషిని చూడగానే అంత కోపం వస్తుంది? పల్లెల్లో ఎక్కువగా వినిపించే మాటల్లో ‘పెయ్యిపొంట ముడ్లు’ అనే పదబంధం ఒకటి. ‘పెయ్యి’ అంటే శరీరం. ‘పొంట’ అంటే వెంట. ఈ పలుకుబడి కోపానికి, అసహనానికి ప్రతీక. ఆ ఇద్దరి శత్రుత్వానికి పరాకాష్ట. అంతలా నమ్మించి మోసం చేసిన వారు ఎదురైతే తట్టుకోలేం. ‘కాలికింద దుమ్ము’ ఆగదు. కోపం కట్టలు తెంచుకుంటుంది. ఒంటికి ముండ్లు
పొడిచినంతగా శరీరం చిటచిటమంటుంది. ఇంకొంతసేపు కంటిముందే ఉంటే ఖతమే. ఆది నుంచీ తెలంగాణ జానపదులు నమ్మకద్రోహాన్ని సహించరు. ‘కుడుము ఇస్తే పండగ’ చేసుకునే అమాయకులు. నమ్మకంగా బతికే మట్టిమనుషులు.
అర్థ వివరణ

1. వరదక్షిణ = కట్న కానుకలు (పిలగానికి వరదక్షిణ ఏం పెడుతున్నరో ఇంకా చెప్పలేనేదు.. అప్పుడే లగ్గమేంది?)
2. సగేసుడు = అర్థమయ్యేలా చెప్పడం (మా చిన్నోడు చదువుకు పోనని రెంకేస్తుండు.. కొంచెం సగెయ్యరాదు బిడ్డా)
3. రుదా = వృథా (నీళ్లు లేని పొలానికి ఎంతపెట్టినా రుదా కర్చే)
4. మూడు పానాదులు = అడ్డరోడ్డు, మూడు రోడ్లు కలిసిన రహదారి (సక్కంగా ముందుకెళ్తె మూడు పానాదులొస్తయ్. అక్కడ యడం దిక్కుకు మళ్లాలె)
5. బులాకి = ముక్కుపుడక/ ముక్కుకు తొడిగే ఆభరణం (లచ్చిమి పెట్టుకున్న బులాకి ఎంత ముద్దుగుందో..)
– డప్పు రవి
Read Today's Latest Palukubadulu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
New Districts | కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల దశాబ్ది వేడుక
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

