1 అల్లరా = ఆందోళన, భయం
(ఇద్దరు లగ్గానికెదిగిన బిడ్డలున్నరు. చదువేంది? తిండేంది? బట్టలేంది? ఈటిపై కొంచెమన్న
అల్లరా లేకపాయె. నువ్విట్ల చీకుచింత లేకుంట
ఇంట్ల కూసుంటే ఇద్దరికి ఉన్నదే కొలుపు)
2 ఒలిశింతసేపు =
కావల్సినంత సేపు
( ఓ పోడా.. నీకు ఒలిశింతసేపు
ఉంచుకున్నవ్..
ఇప్పుడు నావంతు అచ్చేసరికి…
మల్లీయమంటున్నవా?)
3 ఉచ్చితార్థంగా =
కారణం లేకుండా,
అన్యాయంగా (ఉచ్చితార్థంగా పొట్టపెట్టుకున్నడయ్యో బిడ్డనో..
ఆ పాపిస్టోడికి నేను
బిడ్డనియ్యనంటే
అంతాకలిసి దాని
గొంతు కోస్తిరా
అమ్మా..)
4 అటకెకించుడు =చేయకూడదని ఉద్దేశంతో పని
పకనపెట్టడం (వీనికి ఏపని జెప్పినా అటకెక్కించుడే.
ఎందుకే ఈనికి
బువ్వ.. నీళ్లు..?)
5 ఎడ్డెడ్డిగా = అమాయకంగా
(నేనొచ్చినసంది సూత్తన్నా.. చిన్నోడు ఎడ్డెడ్డిగా చేస్తాండు. ఒంట్లేమన్న బాలేదా?)