1.కడ్పుల పేగుల్లేనోడు = కటిక పేదవాడు (తిండికి గింజల్లేవు దొర. మాసొంటి కడ్పుల పేగుల్లేనోళ్లను మీరే సూసుకోవాల. ఈ పూట ఎల్లదీయండి బాంచన్)
2.సట్టం = వంశం (రేయ్ ఇది మన తాతముత్తాతల సట్టం. మన పెద్దోళ్లంతా ఆచారాలకు కట్టుబడ్డారు. నువ్విప్పుడు కొత్తగా చెప్పేదేం లేదు)
3.నరమానవుడు లేడు = ఒక్క మనిషి కూడా లేడు (మన పక్కూరిలో దయ్యం భయంతో అంతా ఇండ్లిడిసిపెట్టిన్రు. చూద్దామన్నా ఒక్క నరమానవుడు కూడ కన్పిస్తలేడు)
4.ఊబపోతు = చూపుల గుర్రం/పని చేతకానోళ్లు (వీడిదంతా ఊబపోతు యవ్వారమే. ఒక్క పనీ చేతకాదు. తిండికేమాత్రం తక్కువగావొద్దు)
5.కార్ఖానా= ఫ్యాక్టరీ (మన ఊళ్ల పోరగాళ్లకు కొలువులు ఇప్పించేందుకు గౌర్మెంట్ కొత్తగా కార్ఖానా కడ్తదంట. మనమంతా జర మాటసాయం చెయ్యాలె)