భ్రమరకీట న్యాయం తెలుసా?
‘వాళ్లిద్దరిదీ భ్రమరకీట సంబంధం. చాలా గొప్పది కూడా!’ అంటుంటారు పెద్దలు. భ్రమరకీట సంబంధం/ భ్రమరకీట న్యాయం అంటే గురుశిష్య సంబంధం. తండ్రీకొడుకుల అనుబంధమూ కావచ్చు.
‘వాళ్లిద్దరిదీ భ్రమరకీట సంబంధం. చాలా గొప్పది కూడా!’ అంటుంటారు పెద్దలు. భ్రమరకీట సంబంధం/ భ్రమరకీట న్యాయం అంటే గురుశిష్య సంబంధం. తండ్రీకొడుకుల అనుబంధమూ కావచ్చు. భ్రమరం అంటే తుమ్మెద. కీటం అంటే పురుగు. ప్రయత్నపూర్వకంగా ఒక సామాన్యుడిని తనంతటి వాణ్ని చెయ్యడం. అంటే.. గురువు శిష్యులకు తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పడం. ఓ తండ్రి తన కొడుక్కి మంచిచెడ్డలు బోధించి..
ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడం. అప్పుడే పుట్టిన తేనెటీగ చుట్టూ.. తుమ్మెద ఝంకారం చేస్తూ పరిభ్రమిస్తుంటుంది. అది చూసిన ఈ చిన్న పురుగు సైతం తన రెక్కలు ఆడిస్తూ.. ఎగరడం నేర్చుకుంటుంది. తర్వాత దానంతట అదే ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. అభివృద్ధిలోకి తెచ్చినవాడు భ్రమరం.. అభివృద్ధికి వచ్చినవాడు కీటం. వీరిద్దరి మధ్య సంబంధమే భ్రమరకీట న్యాయం.
Read Today's Latest Palukubadulu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

