ఇంటోడు ఈకతోటి కొడితే..

కొందరు ఇంట్లో గొడ్డుచాకిరి చేస్తుంటారు. వాళ్లు ఎంత కష్టపడినా పైకి మాత్రం వేరేవాళ్ల పేరు వినిపిస్తుంటుంది. అంత పనిచేసినా కనీస మర్యాద దక్కదు. ఇంట్లోవాళ్లే సరైన విలువ ఇవ్వనప్పుడు బయటివాళ్లు మాత్రం ఎందుకు గౌరవిస్తారు. ఇలాంటి సందర్భాల్లో
‘ఇంటోడు ఈకతో కొడితే.. బైటోడు తోకతో కొట్టిండట’ అనే సామెతను వాడుతారు. ఇంట్లోనే చీత్కారాలు ఎదురవుతుంటే.. ఆ అలుసుతో బయటి వ్యక్తులు కూడా ఒక్కోసారి విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి వ్యక్తులైనా.. ఇంట్లోవాళ్లకు సరైన మర్యాద, విలువ ఇవ్వాలని హెచ్చరిస్తూ ఈ సామెతను చెప్పారు. ఈక, తోక ప్రాసతో పామరులకు సైతం అర్థమయ్యే రీతిలోప్రయోగించారు పెద్దలు.
ఓరి ఇసపాత్కపోడా? నీ మొకం మండ!
ఇది పల్లెటూళ్లలో సాధారణంగా వినబడే పలుకుబడి. ఈ పదబంధంలో ‘ఇసపాత్కపోడా’ అంటే విషపు ఆత్మగలవాడు, దుష్టుడు, ఇతరులకు హాని తలపెట్టేవాడు అని అర్థం. తెలంగాణలో ఇదొక తిట్టు. ఇదే పదాన్ని కొన్ని ప్రాంతాల్లో ఇసముట్టోడు, మేలోర్వనోడు, ఇసపాత్కపోడుగా వ్యవహరిస్తారు. అంటే మనసులో విషం నింపుకొన్న పాపాత్ముడని అర్థం. ‘వాడితో దోస్తానం చేయకురా.. వాడి వొళ్లంతా ఇసమే! ఒట్టి ఇస్సపాత్కపోడు!’ అంటారు పెద్దలు. మన మధ్యనే ఉంటూ మన చెడును కోరుకునే వ్యక్తులు ఈ కాలంలో ఎక్కువగా తారసపడుతుంటారు. వారితో కొంచెం జాగ్రత్త సుమీ!
పుర్రెల పుట్టిన గుణం పుల్లల్లేసిన పోదు!
ఓ వ్యక్తిలోని మంచిచెడులను విశ్లేషించే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఎన్నేండ్లు గడిచినా కొందరి ఆలోచనలు, ప్రవర్తనలో ఎలాంటి మార్పూ ఉండదు. ఇలాంటి వాళ్లను ఉద్దేశించి జానపదులు చెప్పిందే ‘పుర్రెల పుట్టిన గుణం పుల్లల్లేసిన పోదు!’ సామెత. పుట్టుకతో వచ్చిన బుద్ధి మనిషి చనిపోయేవరకూ ఉంటుందనేది దీని అర్థం. అయితే, కొంతమంది మాత్రం తమలోని మంచిచెడులను బేరీజు వేసుకొని.. మార్పు చెందుతుంటారు. ఇంకొందరు పరిస్థితులను బట్టి ప్రవర్తనను మార్చుకుంటారు. ‘పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గానీ పోదు’, ‘చాటల వడ్డ నాటి గుణం సచ్చేదాక పోదు, ‘పుడుతూ పుట్టింది పుల్లల్ల పెట్టినా పోదు’ లాంటి సామెతలు కూడా ఇలాంటి అర్థాన్నే ఇస్తాయి.
‘ఎర్రబొట్టు బువ్వ’ తినేయండి!
ఈ పదబంధం తెలంగాణలోని కొన్ని జిల్లాల పరిధిలోనే ఎక్కువగా వినిపిస్తుంటుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఈ ‘ఎర్రబొట్టు బువ్వ’ అంటే తెలియని వారుండరు. ఎర్రబొట్టు బువ్వ అంటే పప్పన్నం. పెండ్లి కుదిరిన తర్వాత పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు ఇంట్లో మాటముచ్చట సందర్భంగానో, నిశ్చయం రోజునో ఇరుపక్షాలు భోజనాలు చేస్తారు. ఈ విందులో బూరెలు తప్పక వడ్డిస్తారు. పెండ్లి చూపులు ముగిసి, ఇద్దరికీ నచ్చితే ‘శుభం! ఆలస్యం చేయకుండా ‘ఎర్రబొట్టు బువ్వ’ కానిచ్చేయండి?’ అనేవాళ్లు పెద్దలు. కాలక్రమంలో ఈ తంతే ఎంగేజ్‌మెంట్‌గా రూపాంతరం చెందింది.
Read Today's Latest Palukubadulu News in Telugu and Telugu News
- Tags
- palukubadi
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

