క్రోధి కోరిక
క్రోధి నామ వత్సరం తెలుగు కొత్త వత్సరం ఖాయముగా మాయజేయు మనుషుల మద మత్సరం
క్రోధి నామ వత్సరం
తెలుగు కొత్త వత్సరం
ఖాయముగా మాయజేయు
మనుషుల మద మత్సరం
వేప కొసల వెండి పూత
తీయని కోయిల కూత
పులుపు, వగరు కలయిక గల
మామిడి పిందెల కాత
పంచాంగపు శ్రవణాలతో
గుడి గంటల మోత
ఆరు రుతువులకు రాజు
ఈ ఉగాది ఆమని
ప్రకృతికే కొత్త కాంతి మన
వసంత యామిని
తీపీ, పులుపూ, ఉప్పూ
చేదు, వగరు, కారం
అను ఆరురుచులు
నిత్యపు జీవనాన అనివార్యం
శిశిరం ఆకులు రాల్చిన
చెట్టెప్పుడు కుంగదు
చివురు వేయు చేవ ఉన్న
వసంతమెపుడు పొంగదు
మండుటెండలతో గ్రీష్మం అహం హుంకరించినా
వర్షరుతువు స్వాగతింప చల్లబడుట మానదు
శరన్మేఘ మాలిక వలె హేమంతపు చలిమంటలు
కాలపు సహకారంతో పండును బతుకుల పంటలు
వైవిధ్యపు భారత రథ రుతుచక్ర భ్రమణం
మనసును ఇరుసుగ మార్చెడి మనజీవన గమనం
రుచులు ఆరు రుతువులారు
ఉగాది ఏమని కోరు?
మంచి పెంచి పంచడమే మన మనుగడ తీరు
భిన్నత్వపు ఏకత్వం భారతీయ తత్వం
వైవిధ్యపు గమనమే
అసలగు జీవన సత్యం
కులాల కుడ్యము దాటి
గుణమును గౌరవించుదాం
మతాల మౌఢ్యం లేని
మానవతను పంచుదాం
శ్రీ క్రోధి నామ ఉగాదిని
ఊపిరెత్తి పిలుద్దాం
తెలుపు మనసు తెలుగులమై
‘నిషాన’గా నిలుద్దాం…
-మడిపల్లి దక్షిణామూర్తి
98662 77107
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

