నిరంతర విద్యుత్తు ఏమైపాయె?
రాష్ట్రంలో విద్యుత్తు కోతలు రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. వ్యవసాయానికి సరిపడా కరెంటు అందడం లేదు. రైతులు సబ్స్టేషన్ల వద్ద ఆందోళనలు చేస్తున్నారు.వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు విద్యుత్తు అంతరాయాలు అదనపు భారంగా మారుతున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్లో పలు ప్రాంతాల్లో రైతులు నిరసనలకు దిగారు.
రాష్ట్రంలో విద్యుత్తు కోతలు రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. వ్యవసాయానికి సరిపడా కరెంటు అందడం లేదు. రైతులు సబ్స్టేషన్ల వద్ద ఆందోళనలు చేస్తున్నారు.వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు విద్యుత్తు అంతరాయాలు అదనపు భారంగా మారుతున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్లో పలు ప్రాంతాల్లో రైతులు నిరసనలకు దిగారు. ఈ పరిస్థితుల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా ఇప్పుడు ఏమైపోయిందన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతున్నది. ప్రభుత్వం చెప్తున్న విద్యుత్తు సరఫరా లెక్కలకు, రైతులు అనుభవిస్తున్న వాస్తవ పరిస్థితులకు మధ్య తేడా ఎందుకు కనిపిస్తున్నది? ఈ ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు రాజకీయ ఆరోపణలతో ఎదురుదాడికి పాల్పడకుండా వాస్తవాలతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.
రైతుల పొలాలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. సరిపడా ఎరువులు దొరకక ఆందోళనలో చిక్కుకున్నారు. ఇటువంటి సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో విద్యుత్తు కోతలు మరో సంక్షోభాన్ని సృష్టించాయి. ఆ సంక్షోభంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కరెంటు ఎప్పు డు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళల్లో పొలాలకు వెళ్లాల్సి రావడం, మోటార్ల వద్ద వేచి ఉండటం, తక్కువ వోల్టేజీతో పంపుసెట్లు దెబ్బతినడం వంటి సమస్యలతో రైతులు నష్టపోతున్నారు. విద్యుత్తు అంతరాయాలతో పంటకు సరైన సమయంలో నీరు అందకపోతే దిగుబడి తగ్గుతుంది. పంట నష్టపోతే దాని ప్రభావం తర్వాతి సాగు పెట్టుబడులపైనా పడుతుంది. విద్యుత్తు కోతల సమస్య సాగుతోనే ఆగిపోదు. చిన్న పరిశ్రమలు, వర్క్షాపులు, దుకాణాలు, సేవారంగ సంస్థల పని కూడా విద్యుత్తుపై ఆధారపడుతుంది. కోతల వల్ల ఉత్పత్తి నిలిచిపోతుంది. పనివేళల నష్టం, జనరేటర్ల ఏర్పాటుతో ఖర్చులు పెరుగుతాయి. గృహ వినియోగదారులపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది.
ప్రజలకు అవసరమైన మేరకు విద్యుత్తును అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చూడాలి. లోటు ఏర్పడితే ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోళ్లు చేయాలి. ఇందుకోసం ప్రణాళికతో పని చేయాలి. బొగ్గు సరఫరా నిరంతరంగా ఉండేలా చూడాలి. ఉత్పత్తి కేంద్రాలను సమర్థంగా నిర్వహించాలి.
ప్రసార, పంపిణీ వ్యవస్థలను పటిష్టం చేయడం కూడా అంతే ముఖ్యం. విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ముందస్తు ప్రణాళిక అవసరం పెరుగుతుంది. రాష్ట్రంలో 202425 ఆర్థిక సంవత్సరంలో నమోదైన విద్యుత్తు గరిష్ఠ డిమాండ్ 17,162 మెగావాట్లు కాగా, 202526లో అది 18,548 మెగావాట్లకు చేరింది. అంటే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి, కొనుగోళ్లు, సరఫరా వ్యవస్థలను నిరంతరం బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ ప్రాంతంలో ఎంత విద్యుత్తు సరఫరా చేస్తున్నారు? ఎంతసేపు అంతరాయాలు ఏర్పడుతున్నాయి? అందుకు కారణం ఏంటో చెప్పాలి. ఉత్పత్తి తగ్గిందా? స్థానిక లైన్లుట్రాన్స్ఫార్మర్లలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రజలకు వెల్లడించాలి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్తును సరఫరా చేసింది. ప్రస్తుత ప్రభుత్వం అదే స్థాయి సేవను కొనసాగించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నది? అంటే సమాధానం లేదు. విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలు, ఉత్పత్తి కేంద్రాల పనితీరు, బొగ్గు నిల్వలు, సరఫరా వ్యవస్థలోని బలహీనతలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. గత ప్రభుత్వంపై అక్కసుతో అనసవర నిందలు వేయడం సమస్యకు పరిష్కారం కాదు. ఈ విషయం కాంగ్రెస్ పాలకులు గుర్తుంచుకోవాలి. విద్యుత్తు సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం తక్షణ, దీర్ఘకాలిక చర్యలను సమాంతరంగా చేపట్టాలి. ముందుగా వ్యవసాయానికి నాణ్యమైన త్రీఫేజ్ విద్యుత్తు సరఫరా షెడ్యూల్ను గ్రామాల వారీగా ప్రకటించాలి. అనివార్యమైన అంతరాయాలు ఏర్పడితే రైతులకు ముందుగానే సమాచారం అందించాలి.
సబ్ స్టేషన్లలో సరఫరా సమయాలను నమోదు చేసి, వాటిని ప్రజలకు అందుబాటులో పెట్టాలి. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. తక్కువ వోల్టేజీ సమస్యలను పరిష్కరించేందుకు ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పరిశీలించాలి. ఓవర్లోడింగ్ ఉన్న ప్రాంతాల్లో అవసరమైన సాంకేతిక మార్పులు చేపట్టాలి. మరమ్మతులు, నిర్వహణను ముందస్తు స్పష్టమైన ప్రణాళిక అమలు చేయాలి. విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం, బొగ్గు సరఫరా, విద్యుత్తు కొనుగోళ్లను సమీక్షిస్తూ నెల ముందుగానే అంచనా వేయాలి. సౌర విద్యుత్తు ఉత్పత్తిని పెంచడంతోపాటు, అవసరమైన చోట నిల్వ సాంకేతికతను అభివృద్ధి చేయడం కూడా దీర్ఘకాలిక పరిష్కారంలో భాగం కావాలి. విద్యుత్తు సంస్థల ఆర్థిక పరిస్థితిని నిర్లక్ష్యం చేయకూడదు. సరఫరా వ్యయం, ఒప్పందాలు, బకాయిలు, రాయితీల చెల్లింపులపై పారదర్శకత అవసరం. విద్యుత్తు నాణ్యత, సరఫరా తగ్గకూడదు. ఉచిత విద్యుత్తు పథకాలు కొనసాగించాలి. అవసరమైన నిధులు, విద్యుత్తు లభ్యతపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి. అనుభవ రాహిత్యంతో వ్యవహరిస్తున్న సీఎం భేషజాలకు పోకుండా ప్రజల ఇబ్బందులను పరిష్కరించేలా కృషి చేయాలి.
విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు లేవని ప్రభుత్వం బుకాయిస్తున్నది. మరి సబ్స్టేషన్ల వద్ద రైతులు ఎందుకు నిరసనలు తెలుపుతున్నారో మంత్రులు వివరించాలి. సమస్యలను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెప్పాలి. ఎక్కడైనా సరఫరా లోపం ఉంటే బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిలో వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు కీలక పాత్ర పోషించాయి. ఆ ప్రగతి కొనసాగాలంటే విద్యుత్తు సరఫరాలో స్థిరత్వం ఉండాలి. ప్రభుత్వం ముందున్న పని ఒక్కటే. విద్యుత్తు సరఫరాపై ప్రకటనలు ఎన్ని చేశారనేది కాదు, ప్రజలకు నాణ్యమైన కరెంటును ఎంత నిరంతరంగా అందించారనేది ముఖ్యం. మాటల కు, చేతలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తేనే విద్యుత్తు కోతల సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు లేవని ప్రభుత్వం బుకాయిస్తున్నది. మరి సబ్స్టేషన్ల వద్ద రైతులు ఎందుకు నిరసనలు తెలుపుతున్నారో మంత్రులు వివరించాలి. సమస్యలను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెప్పాలి. ఎక్కడైనా సరఫరా లోపం ఉంటే బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడం ప్రభుత్వ బాధ్యత. తెలంగాణ సాధించిన అభివృద్ధిలో వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు కీలక పాత్ర పోషించాయి.
(వ్యాసకర్త : రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
సర్దార్ రవీందర్ సింగ్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

