చిన్న చిత్రంగా విడుదలై అశేష జనాన్ని విశేషంగా ఆకట్టుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది బలగం సినిమా. కొద్దిరోజులుగా ఏ నోట విన్నా.. ఏ నలుగురు కలిసినా ఈ సినిమా ముచ్చటే. బలగంను సినిమా అనే కంటే నిజ జీవితం అంటే బాగుంటుంది. ఎందుకంటే, ఈ సినిమా ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఇరవై ముప్ఫై ఏండ్లుగా సిన్మా చూడని వారిని మళ్లీ థియేటర్‌కు రప్పించిన చిత్రమిది. పల్లెల నుంచి బండ్లు కట్టుకుని వెళ్లి మరీ ఈ సినిమా చూస్తున్నారు. పల్లెల్లో ప్రత్యేకంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.
మరణించిన తాత ఆత్మ పిట్ట ముట్టలేదనే చిన్న కాన్సెప్ట్ తీసుకుని అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు, మొత్తం చిత్రం బృందం అభినందనీయులు. ఈ సినిమా తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తున్నది. మన ఆచారాలు, పద్ధతులు, సంస్కృతీ సంప్రదాయాలను కండ్లకు కట్టింది. పంతాలు, పట్టింపులు, ఇగోలు అనేక సీన్లలో కనిపిస్తుంటాయి. నటులు దాదాపుగా అందరూ కొత్త ముఖాలే. వారి పాత్రల్లో జీవించారు. ఎక్కడా అశ్లీలత, అసభ్యత, అనవసర సన్నివేశాలు కానరావు.
ఈ సినిమా చూస్తున్నంత సేపు మన ఇంట్లో, మన పక్కింట్లో, మన ఊరిలో జరుగుతున్న నిజ జీవిత సంఘటనలే అన్నట్లుగా కథ సాగుతుంది. రకరకాల కారణాలతో విడిపోయిన కుటుంబ సభ్యులు బలగం సినిమా చూసిన తర్వాత మళ్లీ ఒక్కటవుతున్నారు. దీనికి ఉదాహరణ.. ఆదిలాబాద్ జిల్లాలో భూవివాదంతో దూరమైన అన్నదమ్ములిద్దరూ మళ్లీ కలవడం. తాతలు, నాయినమ్మ/అమ్మమ్మలు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారి విలువ తెలియక, వారి గురించి పట్టించుకోక.. బలగం సినిమా చూసిన తర్వాత ఇప్పుడు వారు లేని లోటు గుర్తుతెచ్చుకుని కంటతడి పెట్టుకుంటున్నారు ఎంతోమంది. కరోనాతో అయినవాళ్లు అందనంత దూరం వెళ్లడం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇప్పటికీ అనేక కుటుంబాల్ల ఆ దుఃఖం తీరలేదు. బలగం సినిమా చూసిన వారు దూరమైన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకొని కన్నీరు మున్నీరవుతున్నారు.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్నింటికీ తగిన సమయంలో సమాధానం చెబుతుంది. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. పాట.. మాట.. యాస.. సంస్కృతి.. ఆచారం.. వ్యవహారం.. ఇప్పుడు తెలంగాణ తేజస్సు తెలుగు సినిమా రంగంలో వెలిగి పోతున్నది. తెలంగాణ కంటెంట్ లేనిదే సినిమాలు నడవని రోజులు వచ్చాయి. తెలంగాణ సమాజానికి ఊరకనే ఈ గుర్తింపు రాలేదు. దాని వెనక ఉన్న బలం.. బలగం మన బాపు కేసీఆర్.
మన బలం, బలగం మన బాపు కేసీఆర్
ఒకప్పుడు తెలుగు సినిమాల చిత్రీకరణలు ఎక్కువగా ఆంధ్రా ప్రాంతంలోనే జరిగేవి. పచ్చని పొలాలు, కాలువలు, నదులు, ఆలయాల వద్ద సీన్లు తీయాలంటే కోనసీమ తదితర సీమాంధ్ర ప్రాంతాలను ఎంచుకుని అక్కడి ప్రాంతాలనే చూపించేవారు. సమైక్య రాష్ట్రంలో ఏ రంగంలో చూసినా మనకు ఏమాత్రం ప్రాధాన్యం, గుర్తింపు దక్కలేదు. మన యాసను విలన్, జోకర్ పాత్రధారులతో పలికించి అవమానించిన సంఘటనలు మరిచిపోలేం. మన సంస్కృతీ సంప్రదాయాలు ఎవరికీ పట్టేవి కావు. ఉద్దేశపూర్వకంగానే అణచివేతకు గురయ్యాం.
ఇదంతా జగమెరిగిన సత్యం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్నింటికీ తగిన సమయంలో సమాధానం చెబుతుంది. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. పాట.. మాట.. యాస.. సంస్కృతి.. ఆచారం.. వ్యవహారం.. ఇప్పుడు తెలంగాణ తేజస్సు తెలుగు సినిమా రంగంలో వెలిగి పోతున్నది. తెలంగాణ కంటెంట్ లేనిదే సినిమాలు నడవని రోజులు వచ్చాయి. తెలంగాణ సమాజానికి ఊరకనే ఈ గుర్తింపు రాలేదు. దాని వెనక ఉన్న బలం.. బలగం మన బాపు కేసీఆర్. ఆయన సారథ్యం వహించాక తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది.
ఆయన అధికారంలోకి వచ్చాక తెలంగాణ బ్రాండ్ అంతటా మార్మోగుతున్నది. పాలన, సంక్షేమం, విధానాలు దేనికైనా ప్రస్తుతం తెలంగాణనే దేశానికి ఆదర్శంగా మారింది. ఎట్లున్న తెలంగాణ ఎైట్లెంది. ఒకప్పుడు అన్నమో రామచంద్ర అన్న తెలంగాణ ఇప్పుడు దేశానికి అన్నపూర్ణ అయ్యింది. తెలంగాణ నేల పైన గంగమ్మ పొంగి జలతాండవం చేస్తున్నది. మండుటెండల్లో మత్తళ్లు దుంకడం ఎన్నడైనా చూశామా. కలలో కూడా ఊహించనివి ఇప్పుడు తెలంగాణలో సాధ్యమవుతున్నాయి.
వీటన్నింటికి బలంగా సినిమా దృశ్యరూపంలా నిలిచింది. ఆ సినిమా చూస్తున్నంత సేపు పచ్చని పొలాలు, కాలువల్లో పారుతున్న నీరు, సంతోషంగా ఉన్న పల్లెసీమలు మనసును పులకరింపజేస్తుంటాయి. పదేండ్ల వెనకకు పోతే.. అప్పట్ల ఎక్కడ చూసినా జీవం కోల్పోయిన పల్లెలే కనిపించేవి. ఉపాధి కోసం జనం వలస పోవడంతో ఇండ్లకు తాళాలు ఉండేవి. గ్రాసం లేక కబేళాలకు తరలిన పశువులు.
ఈ రోజున తెలంగాణ గెలిచి నిలిచింది. అది సినిమాలో కావచ్చు అభివృద్ధిలో, సంక్షేమ పాలనలో కావచ్చు. తెలంగాణ యాస, భాష, సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచ వేదికపై సత్తాచాటుతున్నాయి.
యువత బొంబాయి, దుబాయ్ అంటూ పొట్టకూటికి వలస పోయేది. ఊరిలో ముసలోళ్లు, పిల్లలే ఉండేవాళ్లు. గుక్కెడు నీరు దొరకక పోతుండే, పారకానికి నీరు లేక బీడువడ్డ భూములు కనిపించేవి. పచ్చదనం మచ్చుకైనా ఉండేది కాదు. కనిపించేది కాదు. ఏపల్లె చూసినా బోసిపోయి కనిపించేది. కరెంటోళ్లు బిల్లుల వసూలుకు వస్తున్నరంటే రైతన్నలు భయపడేవారు. బిల్లులు కట్టకపోతే వైర్లు కట్‌చేసుకుని, మోటర్లు తీసుకుని పోయేవారు. ఇప్పుడు కరెంట్ కష్టాలు లేవు.. బిల్లుల బాధ లేదు. సర్కారు చేయూతతో వ్యవసాయం పండుగలా మారింది.
మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నప్పుడు గ్రామాలు అట్టుడుకుపోయినయి. అన్నలు, పోలీసుల మధ్య గ్రామీణ ప్రజలు నలిగిపోయారు. పొద్దుగూకితే ఇంటి నుంచి బయటకు కాలు పెట్టాలంటే భయపడే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అన్నల సప్పుడు లేదు.. పోలీసుల భయం లేదు.. బిక్కుబిక్కు మంటూ గడిపిన రోజులు దూరమయ్యాయి. పల్లె సీమల్లో ప్రశాంతత కనిపిస్తున్నది. మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఈ మార్పు ఊరకే సాధ్యం కాలేదు. దాని వెనక కేసీఆర్ అనే తెలంగాణ బాపు కష్టం ఉన్నది. ఆ బాపు కృషితోనే ఈ రోజున తెలంగాణ గెలిచి నిలిచింది. అది సినిమాలో కావచ్చు అభివృద్ధిలో, సంక్షేమ పాలనలో కావ చ్చు. ఈ రోజు తెలంగాణ యాస, భాష, సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచ వేదికపై సత్తాచాటుతున్నాయంటే అదంతా మన బాపు ఘనతే.
యనిగండ్ల అశోక్
99083 50676