త్యాగానికి ప్రతీక బక్రీద్
ఇస్లాం మతంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ముస్లింలు జీవితకాలంలో ఒకసారైన హజ్‌యాత్ర చేయాలని కోరుకుంటారు. అదికూడా తాము కష్టపడి సంపాదించిన సొమ్ముతో. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరుతారు.
ముస్లింల ప్రధాన పండుగలు రెండు. ఒకటి రంజాన్, మరొకటి బక్రీద్. బక్రీద్ అంటే బకర్ఈద్ అని అర్ధం. బకర్ అంటే మూగజీవి. ఈద్ అంటే పండుగ.ఈ పండుగ ముస్లింలకు ఎంతో ప్రత్యేకమైంది. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ముస్లింల పవిత్రమైన పండుగల్లో ఒకటి. ఈ బక్రీద్ పండుగనే ఈదుల్, అజహా, ఈదుజ్జహా అని కూడా పిలుస్తారు. రంజాన్ తర్వాత ఇస్లామిక్ క్యాలెండర్లో వచ్చే ముఖ్యమైన నెలల్లో ఈ నెల ఒకటి.
ఇస్లాం మతంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ముస్లింలు జీవితకాలంలో ఒకసారైన హజ్‌యాత్ర చేయాలని కోరుకుంటారు. అదికూడా తాము కష్టపడి సంపాదించిన సొమ్ముతో. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరుతారు. ఎలాంటి స్వార్థపూరిత ఆలోచనలు లేకుండా, రాగద్వేషాలు వదిలేసి మానవతను వ్యాప్తి చెందించాలన్నదే బక్రీద్ ఉద్దేశం.
హజ్ యాత్ర కోసం అరబ్ దేశమైన సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకుని మసీద్‌లో ఉన్న కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంటుంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్ చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు. హజ్ తీర్థయాత్రకు
వెళ్లినవారు మక్కా తర్వాత మదీనాను సందర్శిస్తారు.
ఈదుల్ జుహా అనేది మనిషి త్యాగ నిరతిని చాటిచెప్పే పండు గ. కొడుకునే బలిచ్చేందుకు సిద్ధమైన ఇబ్రహీం భక్తికి, త్యాగానికి గుర్తుగా, ఆ సంప్రదాయా న్ని స్మరిస్తూ ఆయన గౌరవార్థ్ధం ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను జరుపుకొంటారు. త్యాగనిరతితోపాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవత్వంతో వ్యవహరించే గొప్పనీతి.. ఈ పండుగలో దాగి ఉన్నది. ప్రపంచానికి దానగుణాన్ని, దయాగుణాన్ని చా టి చెప్పడంలో ఉన్న ఆనందాన్ని బక్రీద్ తెలియజేస్తుంది. అలాగే మానవత్వంతో ఉండాల్సిన అవసరాన్ని బక్రీద్ తెలియజేస్తుంది.
ఖుర్బానీ అంటే బలి మాత్రమే కాకుండా సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థం. అంటే దైవ సాన్నిధ్యాన్ని పొందడం, దైవానికి సమర్పించడం, దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అంతే కాదు.. ప్రాణత్యాగానికైనా వెనుకాడనని చెప్పటమే ఖుర్బానీ పరమార్థమని ముస్లిం పెద్దలు అంటారు. మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేద ప్రజలకు, రెండో భాగం తమ బంధువులకు, మరో భాగం తన కుటుంబానికి పంచి పెడుతారు.
ఆకలి అనేది అందరికీ సమానమైనదే. కాబట్టి ఈ పండుగ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు తమ శక్తి మేరకు దానధర్మాలు చేయాలని పెద్దలు చెప్తారు. తద్వా రా కొంత మందికైనా ఆకలి తీర్చగాలిగామని సంతృప్తి చెందుతా రు. దానగుణం ముడిపడి ఉన్నదే మానవ ధర్మం.
-యాసర్ హుస్సేన్ 90522 39669
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

