బాస నీకు దండమే..!
పలక మీద గీసిన పదం లెక్క పలుకుల మీద వాలిన పాలపిట్ట లెక్క
….నేడు కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం….
పలక మీద గీసిన పదం లెక్క
పలుకుల మీద వాలిన పాలపిట్ట లెక్క
ఎంత సక్కంగుంటవే
నా బాసమ్మ..ఓ యాసమ్మ
జమ్మి చెట్టు కొమ్మా..
అక్షరాల రెమ్మా..నువ్వు మాకు
బంగారానివే..సింగారానివే
బుడిగ జంగాల కథలలో
బాగోతపు వ్యథలతో
జానపదమై వర్థిల్లిన
పాటల పూదోట
నా తెలంగాణ భాష
యాదగిరి యాది నా యాస
ఓరుగల్లునూ..గుండెజల్లునూ
అలుముకున్న స్మృతి
శాతవాహన సప్తశతి
నా తెలంగాణ సంస్కృతి
ఏములవాడ రాజన్న
పాల్కురికి సోమన్న
బమ్మెర పోతన్న
దీవించిన భాష మనది
కొమరం భీముడు ఎత్తిన
పిడికిలైంది నా భాష
సుద్దాల హనుమంతు గొంతెత్తిన
పాటైంది నా భాష
కాళోజీ కలం గీతై
దాశరథి కలల రాతై
కన్నీటి చెలమల్ని
కవ్వించుకుంది నా భాష
మనసెరిగిన మాండలికమై
కన్నతల్లోలే అదుముకుంది
సొంత చెల్లోలే అలుముకుంది
నా తెలంగాణ మాట
తంగేడుపూల బాట
యవారాలూ కువారాలూ
బొంకిచ్చుడు బొర్లేసుడు
తెల్వనట్టి నా భాష
అలాయి బలాయి లిచ్చే
ఆత్మీయత నా యాస
పలుకు పలుకు తేనెలొలుకు
పంచభక్ష్య పర్మాన్నం
ఆపతీ సంపతీల
సోపతి కట్టిన నా బాస
తెలంగాణ తల్లి మెడలో
గొలుసుకట్టు నా యాస
పదహారణాల సొక్కమైన
బాస నీకు దండమే…!
తెలంగాణ గళంలోన చిక్కనైన
యాసనీకు దండమే..!!
డా.కటుకోఝ్వల రమేశ్
99490 83327
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

