విపత్కర పరిస్థితులు

జీవితంలో
కొన్ని విపత్కర పరిస్థితులు
వాటిని మనం ఊహించలేం!
మనం బాధలో వుంటాం
మరొకరి బాధని పంచుకోవాల్సి వస్తుంది!
మనం ఏదో కోల్పోయి దుఃఖిస్తుంటాం
మన కళ్లల్లో కన్నీళ్లు ఉబికి ఉబికి వస్తుంటాయి
మరొకరి కన్నీళ్లని తుడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది!
మనల్ని ఎవరైనా కౌగిలించుకొని
ఓదార్చాల్సిన పరిస్థితి ఉంటుంది
మరొకరిని కౌగిలించుకుని ఓదార్చాల్సిన
పరిస్థితి ఏర్పడుతుంది
చిరునవ్వు కోల్పోయిన పరిస్థితిలో వుంటాం
మరొకరికి చిరునవ్వుని ఇవ్వాల్సి వస్తుంది!
జీవిత తుఫానులో చిక్కుకొని ఉంటాం
మరొకరికి దీవెనలు ఇవ్వాల్సి వస్తుంది!
ఎంతటి విపత్కర పరిస్థితి!
ఈ సృష్టి మన పట్ల కఠినంగా ఉందని అన్పిస్తుంది
మన మీద ఎలాంటి ప్రేమని చూపించటం
లేదని కూడా అన్పిస్తుంది
ఈ పరిస్థితిని
సృష్టి ఓ కానుకగా ఇచ్చిందని
ఓ అవకాశంగా స్వీకరించాలి
అంతే !!
మంగారి రాజేందర్ జింబో
9440483001
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

