రాముని బాటలో వీరు నడువగలరా?
లక్షల ఏండ్ల కిందట, త్రేతాయుగ పురుషుడిగా పుట్టిన దశరథాత్మజుడు శ్రీరాముడిని లోకాలు ఇంకా ఎందుకు గుర్తుంచుకున్నాయి? ఏ ఇతర మానవుడికి దక్కని ఆదరణ, గౌరవం, అభిమానం, ఆరాధన ఆయనకే ఎందుకు దక్కుతున్నాయి? ఇది అర్థం కావాలంటే, రాముడి వ్యక్తిత్వం అర్థం కావాలి.
లక్షల ఏండ్ల కిందట, త్రేతాయుగ పురుషుడిగా పుట్టిన దశరథాత్మజుడు శ్రీరాముడిని లోకాలు ఇంకా ఎందుకు గుర్తుంచుకున్నాయి? ఏ ఇతర మానవుడికి దక్కని ఆదరణ, గౌరవం, అభిమానం, ఆరాధన ఆయనకే ఎందుకు దక్కుతున్నాయి? ఇది అర్థం కావాలంటే, రాముడి వ్యక్తిత్వం అర్థం కావాలి. కండ్లు మూసుకొని రామ భజన చేయడమో, కండ్లు తెరచి రామకోటి రాయడమో కాదు; ఆ మనిషి జీవితం, జీవన విధానం, వ్యక్తిత్వ లక్షణాలు, గుణగణాలు తెలుసుకోవాలి. అటువంటి జీవనాన్ని అనుసరించాలి. ఆ గుణాలను కనీసం అనుకరించటానికి ప్రయత్నించాలి. మొట్టమొదటగా రామాయణం చెప్పిన గుణాలను గుర్తుచేసుకొని, ఆయన ప్రవర్తనను విశ్లేషించి, ఇప్పుడు మనం ఆ బాటను ఎంతవరకు అనుసరించగలమో చూద్దాం!
రామాయణంలో రాముడి గుణాలను ఇలా వర్ణించారు. గొప్ప పరాక్రమవంతుడు, ధర్మం తెలిసినవాడు, కృతజ్ఞత కలవాడు, సత్యవంతుడు, ధృడ సంకల్పి, మంచి నడవడిక కలవాడు, సర్వ ప్రాణుల హితమునాచరించువాడు, విద్వాంసుడు, అసాధ్య కార్యములను సాధించు సామర్థ్యం కలవాడు, ఆహ్లాదమైన రూపం కలవాడు, ధైర్యం కలవాడు, కోపాన్ని జయించినవాడు, అసూయలేనివాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, నిర్వికారుడు, స్వయంప్రకాశ స్వరూపుడు. ‘రమయతీతి రామః’ అంటే ఆనందం కలుగజేయువాడని అర్థం. ఇన్ని శుభ లక్షణాలు గల రాముని చరిత్ర నుంచి మనమేం పాఠాలు నేర్చుకోవాలి?
మొట్టమొదటగా రాముని జీవితం నుంచి మనకు కనపడేది తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం. బాలుడిగా ఉండగానే తండ్రి పంపినప్పుడు విశ్వామిత్ర యాగ రక్షణకు వెళ్లాడు. తర్వాతి లక్షణం పరాక్రమం. యాగ రక్షణ జేసి, రాక్షసులను తరమడమే కాకుండా, శివధనస్సు సంధించి తన కంటే ఎంతో అనుభవజ్ఞులు, రాజులు చేయలేని పనిచేశాడు. ఇది ఆయన పట్టుదల, సంకల్పబలాలను తెలియజేస్తాయి. అన్ని పరిస్థితులూ బాగున్నప్పుడు అందరికీ ధైర్యముంటది. అంతవరకు సామ్రాజ్యంలో తల్లిదండ్రులు, యాగరక్షణ తర్వాత గురువు విశ్వామిత్రుడు తోడుగా ఉన్నారు. మరి పరిస్థితులు తారుమారైతే?
ఆనందంగా సాగుతున్న జీవితంలో పట్టాభిషేకం ఇంకా సంతోషాన్ని, కీర్తిని తెచ్చిపెట్టే ఘట్టం. మరి చివరి నిమిషంలో తల్లి ప్రేమ పంచిన కైకేయి కోరికలకు కోపగించాడా శ్రీరాముడు? లేదు. అమిత ఆగ్రహంతో ఒళ్లు మరిచి తండ్రిని ఎదిరిస్తానన్న లక్ష్మణుడిని శాంతపరిచాడు. కానలకి వెళ్లాలన్న సవతితల్లికి మనఃపూర్వకంగా నమస్కరించి చిరునవ్వుతో తండ్రికి వీడ్కోలు పలికి సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికి బయల్దేరాడు ఆ నిర్వికారుడు, ఇంద్రియాలను జయించిన ధీరుడు. బాహ్యంగా ఉన్న శత్రువులను జయించటం చాలామందికి సాధ్యమే.
మరి అంతర్గత విరోధులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని జయించటం అంత తేలికా? రాజవుదామన్న కామం (కోరిక) లేదు, ఆ అవకాశాన్ని చెడగొట్టిన సవతి తల్లి మీద క్రోధం లేదు, అధికార లోభం లేదు, పరిపాలకుడి కీర్తి మీద మోహం లేదు, రాజు అయి తీరాలన్న మదం (అహం) లేదు, తన స్థానంలో నిలవబోతున్న తమ్ముడు భరతుడి మీద మత్సరం (అసూయ) లేదు! అరిషడ్వర్గాలని జయించిన స్థితప్రజ్ఞుడు శ్రీరాముడు. అదీ మొదటి కారణం యుగయుగాలకి మానవులందరికీ ఆదర్శ పురుషుడిగా శ్రీరాముడు నిలవటానికి. ఇక ధర్మరక్షుడిగా రాక్షసులను సంహరించటం అవలీలగా చేశాడు ఈ అమిత పరాక్రమవంతుడు. వేదాల్లో ప్రవచించిన సనాతన ధర్మాన్ని అనుసరించి, మంచి కోరని, మారని దురాత్ములను సంహరించాడు, ధర్మాత్ములని రక్షించాడు. నిజానికి సొంత అన్నదమ్ములైన వాలీ, సుగ్రీవులు ఆయనకు సంబంధీకులు కారు. కానీ అక్కడ అధర్మ ప్రవర్తనను ఖండించి, ధర్మ ప్రవర్తనను చూపించి సుగ్రీవుడికి పట్టం కట్టాడు.
జాతి భేదం లేకుండా అందరినీ ఆదరించాడు. ప్రకృతిని ప్రేమించి చరిత్రలో ఒకే ధర్మం, ఒకే దార (భార్య) అని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు. శూర్ఫణక శృంగార చేష్టలకు చెదరలేదు. దూరమైన సతి తలపులలో బతికాడు. ఆమెను రక్షించటానికి సాహసంగా సముద్ర మథనం చేశాడు. లంకకు చేరి భీకర పోరు సలిపాడు. అయితే మంచి, చెడుల విచక్షణ మరవలేదు. రావణ, కుంభకర్ణుల సోదరుడు విభీషణుడిని ఆదరించాడు. ఈ రకమైన విచక్షణ ప్రపంచంలోని మానవులందరికీ ఆదర్శం. వేరే కులమో, మతమో, దేశమో అయినంత మాత్రాన అంతా చెడ్డవారే అనుకోవటం ఎంత తెలివి తక్కువతనమో చూపించాడు మానవులకు.
తమకు ఆప్తుడైన జటాయువుకి ఎంత అభిమానంగా, గౌరవంగా కర్మకాండలు చేశాడో, శత్రువైన రావణుడికీ అంతే ఆదరంగా, గౌరవంగా కర్మకాండలు జరిపించి, విభీషణుడికి పట్టం కట్టాడు. మరి ఈ విచక్షణ, ధర్మ ప్రవర్తన మనుష్యులందరికీ ఆదర్శం కాదా! ఏ పరిస్థితుల్లోనైనా ధర్మం తప్పటం, భావావేశంలో పొల్లు మాట, తగని చేత చేయని పూర్ణ ధర్మ స్వరూపం అయోధ్య రాముడు.
మరి ఈ గుణాలన్నీ ఒకసారి చర్విత చర్వణం చేశాక ఇప్పుడు మనం ఏం చేయాలి? అయోధ్య ఎవరిది? ఎవరికి అధికారం ఇవ్వాలి? ఎవ్వరు ఏం చేయాలి? నిజానికి మనం ఏదో చేస్తున్నామని భుజాలు చరచుకోనవసరం లేదు. అన్ని జరగవలసినట్టే జరుగుతాయి. మనం చేయవలసినదొక్కటే! ఏ దేశస్థులైనా, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ జాతివారైనా ఈ లోకాలలో ఉన్నవారందరూ శ్రీరాముడి వారసులే! సనాతన ధర్ములే! ఒకప్పుడు వివిధ రాజ్యాలుగా ఉన్న ప్రపంచంలో బతికి, వేద ఆధ్యాత్మికతను ఆదరించినవారే! కనుక, ప్రపంచం మళ్లీ వేద ధర్మంలోకి, సనాతన సంస్కృతిలోకి వెళుతోంది కనుక అయోధ్య రాముడి సందర్శనానికి అందరినీ ఆహ్వానిద్దాం. అదే మనం శ్రీరాముడికి చూపించే గౌరవం, అభిమానం.
కనకదుర్గ దంటు
89777 243484
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

